వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ముందు డేటింగ్.. తర్వాతే పెళ్లి" : చెల్లెలి పెళ్లికి దేశ అధ్యక్షుడి కండిషన్

|
Google Oneindia TeluguNews

ప్యాంగ్ యంగ్ : హైడ్రోజన్ బాంబుతో ప్రపంచం మొత్తాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మరోసారి ఓ సంచలన ప్రకటనతో వార్తల్లోకి ఎక్కారు. తన గారాల చెల్లెలు కిమ్‌ యో జోంగ్ (29) వివాహానికి సంబంధించి ఓ ప్రకటన చేసిన కిమ్ జాంగ్, తన చెల్లెలిని వివాహామాడబోయే వ్యక్తి పెళ్లికి ముందు ఆమెతో డేటింగ్ చేయాలని షరతు పెట్టడం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చెల్లెలు వివాహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కిమ్ జాంగ్, తన చెల్లెలికి సరైన జోడిని వెతకడం కోసం స్వయవరం ప్రకటించారు. దేశ అధ్యక్షుడి చెల్లెలికి స్వయంవరం అని ప్రకటిస్తే, ఎవరు మాత్రం ప్రయత్నించకుండా ఉంటారు..? కుప్పలు తెప్పలుగా జనం ఎగబడిపోరూ..? అందుకే అధ్యక్షుడు కిమ్ జాంగ్ చాలా తెలివిగా వ్యవహరించారు. స్వయంవరం కోసం వచ్చే వ్యక్తులకు కొన్ని ఖచ్చితమైన షరతులు విధించారు.

Who wants to be Kim Jonguns brotherinlaw?

తన చెల్లెలి స్యయంవరంలో పాల్గొనాలకునే వ్యక్తులు ఖచ్చితంగా బ్రహ్మచారి అయి ఉండాలని, ఫ్యూ యాంగ్‌లోని కిమ్‌ టు సన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందినవారై ఉండాలని, ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉండాలని, అలాగే ఉత్తర కొరియా ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉండాలని షరతులు పెట్టారు. కాగా, ఈ షరతులకు అనుగుణంగా ఇప్పటిదాకా 30 మంది వ్యక్తులు స్వయంవరానికి దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం.

ఇవన్నీ ఒకెత్తు అయితే, పెళ్లికి ముందు తన సోదరితో డేటింగ్‌ తప్పనిసరి అంటూ స్వయంవరానికి హాజరవబోయే వ్యక్తులకు కిమ్ జాంగ్ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే తన సోదరి ఇష్టపడ్డ వ్యక్తితోనే డేటింగ్ ఉంటుందని, ఆ తర్వాతే వివాహా తతంగమని ప్రకటించారు. మొత్తానికి ఏం చేసినా సంచలనమే అన్న చందంగా తయారైంది పరిస్థితి. చూడాలి మరి.. అధ్యక్షుడు కిమ్ జాంగ్ తన సోదరికి ఎలాంటి భర్తను తీసుకొస్తాడో..!

English summary
North Korean leader Kim Jong un is setting up a matchmaking contest to marry-off his younger sister, Kim Yo jung, 29, according to The Sun, a British daily tabloid, quoting anonymous North Korean defectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X