వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదే చివరి హనీమూన్ అనుకున్నా: ‘ఇస్తాంబుల్’ బాధితుడు

|
Google Oneindia TeluguNews

ఇస్తాంబుల్: టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి ఉగ్రవాదులు కాల్పులు, ఆత్మాహుతి దాడులకు తెగబడటంతో 41మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 200మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన అమెరికాకు చెందిన జర్నలిస్టు స్టీవెన్ నబీల్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు.

ఎయిర్‌పోర్టులో ఉగ్ర బీభత్సం: కాల్పులు, ఆత్మాహుతితో 36మంది మృతి(వీడియో)ఎయిర్‌పోర్టులో ఉగ్ర బీభత్సం: కాల్పులు, ఆత్మాహుతితో 36మంది మృతి(వీడియో)

ఆ వివరాల్లోకి వెళితే.. ఇరాక్ దేశంలో పుట్టిన అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న స్టీవెన్ నబీల్, నార్మిన్ నూతన దంపతులు. ఈ జంట హనీమూన్ కోసం టర్కీకి వెళ్లారు. టర్కీలో వారం రోజులపాటు హనీమూన్ ను సరదాగా గడిపిన ఆ భార్యాభర్తలు తిరిగి న్యూయార్క్ కు వెళ్లడం కోసం మంగళవారం అర్ధరాత్రి ఎయిర్ పోర్టుకు వచ్చారు.

కాగా, ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు, కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో తాము కూడా మరణిస్తామేమోనని వారు ఆందోళనకు గురయ్యారు. ఈ హనీమూనే తమకు చివరిది అవుతుందని తాము భావించామని ఈ నూతన దంపతులు చెప్పారు.

Witness to terror: Journalist recounts how attack shattered honeymoon layover

'ఈ హనీమూన్‌తోనే జీవితం ముగిసిందనుకున్నాను... బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఓ గన్‌మెన్ ఆయుధంతో ఎయిర్ పోర్టు ఎంట్రీ పాయింట్ వద్దకు వచ్చాడు. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న కొందరు ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండగా, మరికొందరు ప్రయాణికులు అక్కడ కూర్చుని ఉన్నారు. ఇంతలో ఆ దుండగుడు ఏకే-47తో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో భార్యను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడ్డాను' అని నబీల్ వివరించాడు.

ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హృతిక్: మోడీ దిగ్భ్రాంతిఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హృతిక్: మోడీ దిగ్భ్రాంతి

ఉగ్రవాది తనకు కేవలం అడుగు దూరంలో ఉన్నప్పుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించిందన్నాడు. ఆ ఉగ్రవాది కాల్పులు జరపడంతో తమ జీవితం ఈ ఒక్క హనీమూన్‌తోనే ముగిసిపోయిందని ఆందోళన చెందినట్లు తెలిపాడు. అయితే అక్కడ ఉన్న ఓ బారీకేడ్ వెనుక దాక్కుని ప్రాణాలు నిలబెట్టుకున్నామని చెప్పాడు. భార్య నార్మిన్‌కు కాస్త గాయాలయ్యాయని, కానీ అరవడం లాంటివి మాత్రం చేయవద్దని సూచించినట్లు పేర్కొన్నాడు.

దాదాపు 10-15 నిమిషాల పాటు కాల్పులు జరిపి అనంతరం ఆ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని తెలిపాడు. అంతకుముందు ఆ ఉగ్రవాది కనిపించిన ప్రతీ ఒక్కరిపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి మారణహోమం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

English summary
The 45 minutes my bride and I spent hiding in a beauty salon closet at Ataturk Airport felt like an eternity, as the sound of gunfire and bullets ricocheting through the concourse outside echoed in our ears.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X