వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్యత్వ వేలం : ఇంటి కష్టాలకు ఒంటిని ఖరీదు కడుతోన్న యువతి

|
Google Oneindia TeluguNews

అమెరికా : మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి మనసే పెట్టట్లేదో.. లేక నిజంగానే వేరే మార్గమే కనిపించట్లేదో గానీ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి కన్యత్వాన్ని వేలం పెడుతున్న ఘటనలు ఈమధ్య కాలంలో తరుచుగా వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన కేథరిన్ స్టోన్ అనే 20 ఏళ్ల యువతి తన కన్యత్వానికి వేలానికి పెట్టి హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఆమెకు వచ్చిన కష్టమేంటంటే.. అగ్ని ప్రమాదం కారణంగా 2014లో సియాటెల్ సిటీలో ఉన్న కేథరిన్ ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. విలువైన వస్తువులు, సామాగ్రి పూర్తి కాలిపోవడంతో.. బ్రతుకు రోడ్డున పడింది. అప్పటిదాకా ఉన్నంతలో సాఫీగా సాగిన బతుకు బండి.. ఆ ఘటన తర్వాత ముందుకు సాగడం కష్టతరంగా మారింది.

Woman auctions virginity to highest bidder to repair family home destroyed by fire

ఇంటి బాధలు చూడలేక చలించిపోయిన కేథరిన్.. ఎలాగైనా తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని భావించింది. ఇదే సమయంలో.. 'తన కన్యత్వాన్ని వేలానికి పెట్టి డబ్బు సంపాదించాలన్న' ఆలోచన ఆమె మదిలో మెదలడంతో.. విషయాన్ని నెవడాలో బ్రోతల్ హౌజ్ నిర్వహించే డెన్నిస్ హాఫ్ వ్యక్తికి చేరవేసింది.

దీంతొ 'కేథరిన్ కన్యత్వ వేలం' ప్రకటనను డెన్నిఫ్ ఆన్‌లైన్ లో పోస్టు చేశాడు. ప్రకటన పట్ల స్పందించిన ఓ వ్యక్తి నాలుగు లక్షల డాలర్ల బిడ్ కు సిద్దంగా ఉన్నట్లు కేథరిన్ తెలిపింది. ఆ డబ్బును ఇంటి అవసరాల కోసం ఉపయోగించి.. అనంతరం 'లా కోర్సు' ను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చింది.

ఇదంతా ఇలా ఉంటే.. ప్రపంచంలో మరే మార్గమే లేనట్లు.. కన్యత్వాన్ని వేలం పెట్టి మరీ డబ్బు సంపాదించాలా? అని కేథరిన్ పై విరుచుకుపడుతున్నవారూ లేకపోలేదు. అయితే ఇలాంటి వారందరికీ కౌంటర్ ఇస్తూ.. 'నా శరీరంపై నాకు పూర్తి హక్కు ఉంది. నాకున్న ఇబ్బందుల కారణంగా ఇలా చేయక తప్పలేదు' అని కేథరిన్ గట్టిగానే జవాబిస్తోంది.

English summary
When fire swept through Katherine Stone’s home in Seattle she could not think of a way to turn things around. The family home was not insured, and there was no money to repair it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X