వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 ఏళ్లలో లేని విపత్తు.. భారత్ భిన్నత్వంలో ఏకత్వం, మోడీ యూఎన్ స్పీచ్ హైలైట్స్

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. కరోనా వైరస్ నివారణ, ప్రజల హక్కులు గురించి ఆయన డిస్కష్ చేశారు. ప్రపంచం తీవ్ర భావజాలాన్ని ఎదుర్కొంటుందని వివరించారు. యావత్ ప్రపంచం శాస్త్ర సాంకేతికంగాతోపాటు.. అభివృద్ధి గురించి ఆలోచించాలని కోరారు. దేశం అనుభవంతోపాటు మరింత నేర్చుకోవాలని కోరారు. ఆప్ఘనిస్తాన్ గురించి కూడా మోడీ మాట్లాడారు. ఆ దేశంలో ఉన్న మహిళలు, చిన్నారులు, మైనార్టీల కోసం పాడుపడాలని అభిప్రాయపడ్డారు. ఆ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు/ ఉగ్రవాదంతో ఆ దేశం ఇబ్బందులను ఎదుర్కొనేదని వివరించారు.

 ‘World is facing increased threat of regressive thinking’: PM Modi

ఉగ్రవాదం దేశాన్ని నాశనం చేస్తుందని.. ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. గత వందేళ్లలో లేని విపత్తును ప్రపంచం ఎదుర్కొంటుందని మోడీ వివరించారు. కరోనా వైరస్ వల్ల చనిపోయిన కుటుంబాలకు ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి మోడీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుందని మోడీ గుర్తుచేశారు. దేశంలో పదుల భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు, వేషధారణ ఉన్న భారత్ ఒక ఉప ఖండం అని పేర్కొన్నారు. టీ స్టాల్‌లో టీ అమ్ముకునే చిన్నారి ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం తన దేశం కల్పించిందని వివరించారు. తొలుత సీఎంగా పనిచేశానని.. ఇప్పుడు ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నానని నరేంద్ర మోడీ వివరించారు.

ప్రజాస్వామ్యం ఉంది అని.. అందుకే సాధారణ ప్రజలకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు. అభివృద్ధే తమ నినాదం అని స్పష్టంచేశారు. ప్రపంచంలో ప్రతీ ఆరో వ్యక్తి భారతీయుడేనని మోడీ పేర్కొన్నారు. భారతీయుల ప్రతిభతో.. ప్రపంచం అభివృద్ధి పథంలో నడుస్తోందని చెప్పారు. ఇండియో వృద్ధిలోకి వస్తే.. ప్రపంచం డెవలప్ అవుతుందని తెలిపారు. దేశంలో సంస్కరణలు అమలు చేస్తే.. ప్రపంచం పరివర్తనం చెందుతుందని పేర్కొన్నారు.

ప్రపంచంలో తొలి డీఎన్ఏ టీకా ఇచ్చిందే భారత్ అని మోడీ స్పష్టంచేశారు. 12 ఏళ్లకు పై బడిన వారికి అందజేస్తున్నామని తెలిపారు. అలాగే ముక్కులో వేసే టీకాను భారత శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారని వివరించారు. దేశంలో వాతావరణ మార్పులకు సంబంధించి ప్రకటన చేశారు. 450 గిగావాట్ల పునరుత్పదన శక్తి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. ప్రపంచంలో పెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ మారబోతుందని వివరించారు. మహా సముద్రాలు వారసత్వ సంపద అని వివరించారు. సముద్ర వనరులను ఉపయోగించాలని.. వాటిని దుర్వినియోగం చేయొద్దని కోరారు. అంతర్జాతీయ వాణిజ్యం, జీవనాడిని కాపాడాలని కోరారు.

English summary
Prime Minister Narendra Modi addressed the world leaders at the 76th United Nations General Assembly. He was the first speaker on Saturday’s schedule for the UN General Debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X