ఇది నిజం: 4ఎకరాల్లో సొంత దేశం నిర్మించుకున్న వ్యక్తి
న్యూయార్క్: న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు ఎకరాల పొలంలో సొంత దేశాన్ని నిర్మించుకున్నాడు. దానికి జకిస్తాన్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. తన సొంత దేశానికి అతను ఓ జాతీయ పతాకం రూపొందించుకున్నాడు.
జక్ లాండ్స్‌బర్గ్ అనే వ్యక్తి ఉటా ప్రాంతంలోని నాలుగెకరాల స్థలంలో తన సొంత దేశాన్ని నిర్మించుకున్నాడు. ఆయన నాలుగెకరాల స్థలం కొనుక్కుని దానికి 'జకిస్థాన్' అని నామకరణం చేశాడు. నాలుగెకరాల జకిస్తాన్ దేశాన్ని 24 గంటలూ కాపలా కాసేందుకు ఓ రోబోను ఏర్పాటు చేసుకున్నాడు.

ఎవరైనా సరే తన దేశం పరిధిలోకి రావాలంటే అధికారిక పాస్‌పోర్టులు ఉండాలని స్పష్టం చేశాడు..రోబో సెంట్రీ అనుమతించి లోపలికి రాగానే అధికారికంగా పాస్‌పోర్టుల స్టాంపింగ్ కూడా అయిపోతుందని ఓ టీవీ ఛానల్ వెల్లడించింది. తన దేశానికి ఓ నినాదాన్ని సృష్టించుకున్నాడు.
శూన్యం నుంచి ఎంతో కొంత... అనే నినాదాన్ని తన జకిస్తాన్ దేశానికి పెట్టుకున్నాడు. తనది చట్టపరంగా చెల్లుబాటయ్యే దేశం కాదని తెలుసనీ చెప్పాడు. అయితే, ఓ రకమైన సృజనతో కూడిన కళాత్మక పథకంగా తాను దీనిని భావిస్తున్నానన్నాడు. అయితే, ఓ దేశంగా తాను ఈ నాలుగెకరాల ప్రదేశానికి సార్వభౌమాధికారాన్ని ఎంత మేరకు సాధించగలనో చూసుకోవాలని ఉందన్నాడు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications