న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై వర్సెస్ చెన్నై: 10 అంశాలు, ఏది గెలిచినా రికార్డ్

By Srinivas

కోల్‌కతా: ఐపీఎల్ 8 ఆఖరి అంకానికి చేరుకుంది. ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో ఫైనల్లో తలపడుతున్నాయి.

లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లు దక్కించుకుంది. ముంబై 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ తరఫున సిమన్స్ (472), రోహిత్ (432), పొలార్డ్ (383)లు, చెన్నై తరఫున డుప్లెసిస్ (379), ధోనీ (354), రైనా (346) పరుగులతో టాప్ త్రీ లిస్ట్‌లో ఉన్నారు.

బౌలింగులో, ముంబై తరఫున మలింగ (22), హర్భజన్ సింగ్ (16), మెక్లెనగన్ (15), బ్రావో (24), నెహ్రా (22), అశ్విన్ (10) వికెట్లతో ఉన్నారు. ఇరు జట్లు 21 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై 11సార్లు, చెన్నై 10సార్లు గెలిచింది. ఐపీఎల్ 8లో ముంబై రెండుసార్లు చెన్నైను ఓడించింది. చెన్నై ఒకసారి గెలిచింది. ముంబై లీగ్ దశలో ఒకటి, క్వాలిఫయర్‌లో ఒకటి గెలిచింది. చెన్నై లీగ్ దశలో గెలిచింది.

10 facts about IPL 2015 Final between Chennai Super Kings and Mumbai Indians

1. చెన్నై, ముంబై జట్లు ఐపీఎల్ ఫైనల్లో తలపడటం ఇది మూడోసారి. 2010లో ఈ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అప్పుడు చెన్నై టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2013లో ఇదే జట్లు తలపడగా.. టైటిల్ ముంబై వశమైంది.

2. ఫైనల్లో చెన్నై నెగ్గితే రికార్డ్ సృష్టించనుంది. 3 ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకున్న తొలి జట్టు అవుతుంది. చెన్నై 2010, 2011లో టైటిల్ గెలుచుకుంది.

3. ఐపీఎల్ ఫైనల్ వరకు ఆరుసార్లు వెళ్లి రికార్డ్ సృష్టించింది. 2008, 2010 (గెలుపు), 2011 (గెలుపు), 2012, 2013లలో ఫైనల్ చేరుకుంది. ఇప్పుడు 2015లోను ఫైనల్ చేరింది. అన్ని మ్యాచులకు ధోనీనే సారథి.

4. ఐపీఎల్ ఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో జరగడం ఇది రెండోసారి. 2013లో ఇదే వేదికపై ముంబై - చెన్నై తలపడ్డాయి.

5. ఈసారి ముంబై టైటిల్ నెగ్గితే.. రికీ పాంటింగ్‌కు డబుల్ హ్యాపీ. 2013లో ముంబై గెలిచినప్పుడు అతను ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.

6. ప్రస్తుత చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్.. 2013లో ఇదే జట్లు ఫైనల్లో తలపడ్డప్పుడు ముంబై ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.

7. ఈ లీగ్ దశలో టాప్‌లో నిలిచిన చెన్నై టైటిల్ నెగ్గితే.. లీగ్‌లో ముందంజలో ఉండి టైటిల్ నెగ్గిన రెండో జట్టు అవుతుంది. 2008లో రాజస్థాన్ లీగ్‌లో ముందంజలో ఉండి టైటిల్ నెగ్గింది.

8. గత నాలుగు ఏళ్ల పరిస్థితి చూస్తే ముంబై టైటిల్ నెగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. గత నాలుగేళ్లుగా టైటిల్ నెగ్గిన జట్లు.. లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాయి. ఇప్పుడు కూడా ముంబై రెండో స్థానంలో నిలిచింది. ముంబై టైటిల్ నెగ్గితే.. చెన్నై, కోల్‌కతాల తర్వాత రెండుసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా నిలుస్తుంది.

9. టైటిల్ గెలిచిన జట్టుకు రూ.15 కోట్లు, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.10 కోట్ల బహుమతి వస్తుంది.

10. అనుకోని పరిస్థితుల్లో మ్యాచ్ రద్దయితే (రిజర్వ్‌డ్ డేగా మే 25 ఉంది) లీగ్‌లో ముందంజలో నిలిచిన, మంచి రన్ రేట్ కలిగిన చెన్నైని టైటిల్ వరిస్తుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X