న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోప్ టెస్టులో ఫెయిల్: యూత్ మెడల్ కోల్పోయిన రోహిత్

నిషేధిత ఉత్ర్పేరకం తీసుకోవడం వల్ల డోపింగ్ టెస్టులో 16 ఏళ్ల జావెలిన్ త్రోవర్ రోహిత్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో తాను సాధించిన రజత పతకాన్ని కోల్పోయాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: నిషేధిత ఉత్ర్పేరకం తీసుకోవడం వల్ల డోపింగ్ టెస్టులో 16 ఏళ్ల జావెలిన్ త్రోవర్ రోహిత్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో తాను సాధించిన రజత పతకాన్ని కోల్పోయాడు.

'రోహిత్ యాదవ్ నిషేధిత ఉత్ర్పేరకం స్టాన్జోలాల్ తీసుకోవడం వల్ల అతడికి నిర్వహించిన డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించాం' అని ఎఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు పీటీఐతో వెల్లడించారు.

16-year-old Rohit Yadav fails dope test, to lose Asian youth medal

బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ చివరి రోజైన మే 23వ తేదీన రోహిత్‌కు టెస్టు నిర్వహించామని ఇవి కేవలం శాంపిల్ ఫలితాలు మాత్రమేనని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఎఎఫ్ఐకి అందజేస్తామని అన్నారు.

నేషనల్ యూత్ ఛాంపియన్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా గత నెలలో హైదరాబాద్‌లో ఈ టెస్టుని నిర్వహించారు. కాగా, మే 20-23 వరకు ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌ను బ్యాంకాక్, థాయిలాండ్‌లలో నిర్వహించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Rohit Yadav fails dope test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X