న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20: లంక పరాభవానికి భారత్ ప్రతీకారం

By Pratap

రాంచీ: తొలి ట్వంటీ20 మ్యాచులో ఘోర ఓటమికి శ్రీలంకపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. భారత్ తన ముందు ఉంచిన 197 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి శ్రీలంక కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలింది.

దాంతో భారత్‌కు 69 పరుగుల భారీ తేడాతో విజయం దక్కింది. రెండో టీ20ల విజయంతో భారత్ శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను 1-1 స్కోరుతో సమం చేసింది. మూడో మ్యాచు కీలకంగా మారింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. నెహ్రా, జడేజా, బుమ్రాప్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

భారత్ తన ముందు ఉంచిన 197 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండు పరుగులకే శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. తిలకరత్నే దిల్షాన్ పరుగులేమీ చేయకుండా అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. మూడు పరుగుల స్కోరు వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. ప్రసన్న ఒక పరుగు చేసి నెహ్రా బౌలింగులో వెనుదిరిగాడు.

శ్రీలంక 16 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. గుణతిలక రెండు పరుగులు చేసి నెహ్రా బౌలింగులో అవుటయ్యాడు. శ్రీలంక 68 పరుగుల స్కోరు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న కాపుగెదర, చండీమాల్‌లను జడేజా అవుటే చేశాడు. చండీమాల్ 31 పరుగులు చేసి అవుట్ కాగా, కాపుగెదర 32 పరుగులు చేసి అవుటయ్యాడు.

శ్రీలంక 116 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగులో సురేష్ రైనా అద్బుతమైన క్యాచ్ పట్టి 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శనకను అవుట్ చేశాడు. శ్రీలంక 117 పరుగుల స్కోరు వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. థిసారా పెరారా పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు.

119 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రాహ్ బౌలింగులో సేనా నాయకే పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. 119 పరుగుల వద్దనే శ్రీలంక మరో వికెట్ కోల్పోయింది. చమీరా బుమ్రాహ్ బౌలింగులో పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు.

శ్రీలంకతో రెండో ట్వంటీ20 మ్యాచులో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ధోనీ 9 పరుగులతో, జడేజా 1 పరుగుతో నాటౌట్‌గా మిగిలారు. శ్రీలంక బౌలర్లలో థిసారా పెరెరాకు మూడు వికెట్లు హ్యాట్రిక్ రూపంలో దక్కాయి. చమీరా రెండు వికెట్లు, సేనానాయకే ఒక్క వికెట్ తీశారు.

శ్రీలంకపై రెండో ట్వంటీ20 మ్యాచులో శిఖర్ ధావన్ అర్థ సెంచరీ చేశాడు. అతనికి ట్వంటీ20లో ఇదే తొలి అర్థ సెంచరీ కావడం విశేషం. భారత్ 127 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహనే 21 బంతుల్లో 25 పరుగులు చేసిన సేనానాయకే బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగుల రోహిత్ శర్మ 36 బంతుల్లో 43 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు కూడా చమీరాకే దక్కాయి.

భారత్ 186 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. సురేష్ రైనా 30 పరుగులు చేసి పెరెరా బౌలింగులో ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకు ముందు హార్దిక్ పాండ్యా పెరెరా బౌలింగులోనే 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అదే స్కోరు వద్ద యువరాజ్ సింగ్ ఆరో వికెట్‌గా పరుగులేమీ చేయకుండా పెరెరా బౌలింగులోనే అవుటయ్యాడు వరుసగా మూడు వికెట్లు తీసి పెరెరా హ్యాట్రిక్ సాధించాడు.

భారత్‌తో రెండో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దినేష్ చండీమాల్ శుక్రవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక తుది జట్టులో ఓ మార్పు చేసింది. నిరోషన్ డిక్‌వెల్లా స్థానంలో సీనియర్ ఆటగాడు తిలక్‌రత్నే దిల్షాన్ వచ్చి చేరాడు.

భారత్ తన తుది జట్టులో ఏ విధమైన మార్పు చేయలేదు. పూణేలో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. భారత్ కేవలం 101 పరుగులు మాత్రమే చేయడంతో శ్రీలంక చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

2nd T20I: Sri Lanka win toss, send unchanged India to bat
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X