న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హ్యూస్ మృతి: బాల్ వేసిన అబోట్ ఏడుపు ఆపుకోలేక.., పక్కనే ఫ్రెండ్స్

By Srinivas

సిడ్నీ: సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ 63 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా.. అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి బౌన్సర్ సంధించిన సిన్ అబోట్ మానసికంగా కుంగిపోయాడు. తాను వేసిన బంతి హ్యూస్ తల కింది భాగంలో బలంగా తగలడం, ఆ తర్వాత ఆసుపత్రిపాలు కావడం అబోట్‌ను తీవ్రంగా కలచివేసింది.

హ్యూస్ మరణ వార్తను అతను తట్టుకోలేకపోతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు పరిస్థితిని గమనించి, అబోట్‌కు మానసిక వైద్యుడి ద్వారా కౌనె్సలింగ్ ఇప్పిస్తున్నారు. అబోట్ వయస్సు 22 ఏళ్లు. నీ తప్పేం లేదని సహచరులు చెబుతున్నప్పటికీ.. హ్యూస్ మరణంలో పరోక్షంగా తన ప్రమేయం ఉందన్న అపరాధ భావంతో కుమిలిపోతున్నాడు.

మంగళవారం హ్యూస్ మైదానంలో కుప్పకూలినప్పటి నుండి అబోట్ మనసు మనసులో లేదంటున్నారు. గురువారం మధ్యాహ్నం హ్యూస్ మరణవార్త విన్నాక అబోట్ మనోవేదన మరింత తీవ్రమైంది. హ్యూస్ మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి కూడా వచ్చిన అబోట్ ఆ సమయంలో ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. లోపలకి వెళ్తూ.. వస్తూ.. ఏడుస్తూనే కనిపించాడు.

Abbott, Man Who Knocked Out Phillip Hughes, Broken

హెల్మెట్ నాణ్యతపై అనుమానాలు!

హ్యూస్ మృతితో ఇప్పుడు హెల్మెట్ల నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయ. భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు వరుణ్ ఆరోన్ వేసిన బంతి స్టువర్ట్ బ్రాడ్ ధరించిన హెల్మెట్ గ్రిల్ నుంచి దూసుకెళ్లి అతని ముక్కుకు తగిలిన విషయం తెలిసిందే. తాజా సంఘటనలో హ్యూస్ హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు. ఇకపై హెల్మెట్ల నాణ్యతా ప్రమాణాలను ఐసిసి నిర్ధారించాలి.

స్నేహితులు పక్కనే

సిన్ అబోట్ వేసిన బంతి బలంగా తల కింది భాగంలో తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్ చికిత్స పొందుతున్న సమయంలో అతని సన్నిహితులు, స్నేహితులు సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఒకప్పుడు హ్యూస్ సహచర ఆటగాడు. క్లార్క్‌తోపాటు బ్రాడ్ హాడిన్, స్టీవెన్ స్మిత్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్, నాథన్ లియాన్, మోజెస్ హెండ్రిక్స్, మిచెల్ స్టార్క్, డానియల్ స్మిత్, కోచ్ డారెన్ లేమన్ తదితరులంతా ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడిపారు.

మెక్‌గ్రాత్‌సహా పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆసుపత్రిలోనే ఉండి, హ్యూస్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. హ్యూస్ మరణ వార్త వారిని తీవ్రంగా కలిచివేసింది. హ్యూస్ వెంట ఉన్నవాళ్లలో చాలామంది భారత్‌తో జరిగే మొదటి టెస్టుకు ఎంపికైన జట్టులోని సభ్యులే. వీరు త్వరగా కోలుకొని, మ్యాచ్‌ల కోసం సిద్ధం కావాల్సి ఉంది. ఒక రకంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేకపోతున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X