న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిటిఎల్ ఢిల్లీ డ్రీమ్స్ సహ యజమానిగా అజయ్ దేవగన్

న్యూఢిల్లీ: క్రీడా రంగంలో ఏదో ఒక ఫ్రాంచైజీని తీసుకుంటున్న బాలీవుడ్ తారల సంఖ్య పెరుగిపోతోంది. ఇప్పటికే పలువురు తారలు క్రికెట్, ఫుట్‌బాల్ తదితర రంగాల్లోకి అడుగుపెట్టగా, తాజాగా వారి సరసన బాలీవుడ్ సింగం అజయ్ దేవ్‌గన్ కూడా చేరారు.

ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సిటిఎల్)లో అతను ఢిల్లీ డ్రీమ్స్ ఫ్రాంచైజీలో వాటాలు తీసుకున్నాడు. వ్యాపారవేత్త సంజీవ్ కసాల్‌తో కలిసి అజయ్ సహ భాగస్వామిగా ఉంటారని ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మాజీ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్ తెలిపారు.

శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ డ్రీమ్స్ ఫ్రాంచైజీ ఆవిర్భావాన్ని ప్రకటించాడు. అజయ్ రాజధానిలో లేరని, అందుకే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని చెప్పారు. అయితే, అతను వీడియో మెసేజ్‌లో తన శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఢిల్లీ డ్రీమ్స్ సహభాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నానని చెప్పినట్లు తెలిపారు.

Ajay Devgan is co-owner of Delhi Dreams in Champions Tennis League

ఇటీవలే మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన మార్టినా హింగిస్ ప్రస్తుతం 'టాప్-25'లో లేదని, కాబట్టి ఆమెకు వైల్డ్ కార్డ్ ఇస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత తారణాల వల్ల ఫిలిప్ కొల్చెర్బెర్ టోర్నీ నుంచి వైదొలిగాడని, అతని స్థానంలో బగ్దాటిస్ వస్తాడని వివరించాడు.

కర్నాటక రాష్ట్ర టెన్నిస్ సంఘం స్టేడియం చాలా పెద్దదని, కాబట్టి అక్కడ టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించామని విజయ్ తెలిపాడు. మిగతా కేంద్రాల్లో టికెట్ ధర 600, 1,000, 2,000 రూపాయలుగా ఉంటుందని వివరించాడు.

ఢిల్లీదే పైచేయి?: నేడు గోవాతో ఐఎస్‌ఎల్ మ్యాచ్

గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐ ఎస్‌ఎల్)లో శుక్రవారం విశ్రాంతి దినంకాగా, శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్, గోవా ఎఫ్‌సి జట్లు ఢీ కొంటాయ. ఈ మ్యాచ్‌లో ఢిల్లీదే పైచేయిగా కనిపిస్తున్నది. ఈ జట్టు ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఒక విజయాన్ని సాధించింది.

మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకొని, ఒక పరాజయా న్ని చవిచూసింది. మొత్తం ఆరు పాయంట్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు గోవా నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకో గలిగింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ జట్టు పరాజయాలు తప్పలేదు. ఒక పాయింట్‌తో గోవా అన్నిటి కంటే చివరి స్థానంలో ఉంది. మెరుగైన స్థి తిలో కనిపిస్తున్న ఢిల్లీని గోవా ఎంత వరకు కట్టడి చేస్తుందో చూడాలి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X