న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ఫైనల్: పూర్తి సమాచారం, క్లార్క్‌‌కు చివరి రోజు... గెలుపెవరిదో...?

By Nageswara Rao

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్‌లో అతి పెద్ద మ్యాచ్ ఆదివారం నాడు జరగనుంది. అదే వరల్డ్ కప్ ఫైనల్. ఈ మ్యాచ్‌కి ప్రపంచంలోని అతి పెద్ద మైదానాల్లో ఒకటైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆతిథ్యదేశాలైన ఆస్టేలియా, న్యూజిలాండ్‌లు తలపడుతుండటమే.

వరల్డ్ కప్ ప్రారంభం రోజు(ఫిబ్రవరి 14)న ఈ రెండు జట్లు మ్యాచ్‌‌లను ఆడి గెలిచాయి. అయితే ఫైనల్ డే రోజు(మార్చి 29)న మాత్రం ఇది సాధ్య పడటం లేదు. ఏదో ఒక జట్టు మాత్రమే గెలవాల్సి ఉంటుంది. గత 43 రోజులుగా సాగుతున్న సమరం చివరి దశకు చేరుకుంది. 11వ ఎడిషన్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నమెంట్లో మొత్తం 48 మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ పైనల్స్‌లో ఛాంపియన్స్ ఎవరో తెలుస్తుంది.

All you need to know about ICC World Cup 2015 Final

వరల్డ్ కప్ పైనల్ గురించిన పూర్తి సమాచారం:

* వేదిక: మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్, రెండోసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తుంది (1992లో తొలిసారి)
* మ్యాచ్ ప్రారంభ సమయం: భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు
* జట్లు: ఆస్టేలియా, న్యూజిలాండ్
* ర్యాంకులు: నెంబర్ 1 (ఆస్టేలియా), నెంబర్ 4 (న్యూజిలాండ్)
* కెప్టెన్లు: మైఖెల్ క్లార్క్ (ఆస్టేలియా), బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)
* ఎన్నిసార్లు ఫైనల్స్‌కు వచ్చాయి: ఆస్టేలియా 7వసారి (1975, 1996లో ఓటమి), న్యూజిలాండ్ - తొలిసారి
* మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కెపాసిటీ: 90,000

All you need to know about ICC World Cup 2015 Final

* ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ వన్డేల నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత క్లార్క్‌ తన నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 33 ఏళ్ల క్లార్క్ కెరీర్‌లో 244 వన్డేలు ఆడాడు.

* శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత అంపైర్ కుమార ధర్మసేన అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. 1996 వరల్డ్‌కప్‌ను గెలిచిన శ్రీలంక జట్టులో ధర్మసేన సభ్యుడు. ఆ ఫైనల్ టీంలో సభ్యుడిగా ఉన్న ధర్మసేన.. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ల మధ్య ఆదివారం జరగనున్న ఫైనల్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. ఇలా ఆటగాడిగా, అంపైర్‌గా ఉండబోతున్న మొదటి వ్యక్తి ధర్మసేననే.

* మ్యాచ్ గనుకు టై అయితే ఫలితం తేలేందుకు సూపర్ ఓవర్‌ను వినియోగిస్తారు.

* ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే, తదుపరి రోజున అదే సమయానికి మళ్లీ నిర్వహిస్తారు.


ఆస్టేలియా-న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్ రికార్డులు:

* ఇప్పటివరకు ఆస్టేలియా-న్యూజిలాండ్ జట్లు 9 సార్లు తలపడితే, 6 సార్లు ఆస్టేలియా గెలుపొందగా, 3 సార్లు న్యూజిలాండ్ విజయం సాధించింది.

All you need to know about ICC World Cup 2015 Final

జట్లు:

ఆస్ట్రేలియా: మైఖేల్ క్లార్క్ (కెప్టెన్), జార్జ్ బెయిలీ (వైస్-కెప్టెన్), ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, గ్లెన్ మాక్స్వెల్, జేమ్స్ ఫాల్క్నెర్, బ్రాడ్ హడిన్ (వికెట్ కీపర్), మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, జోష్ హెజెల్‌వుడ్, మిఛెల్ మార్ష్, పాట్ కమ్మిన్స్, జేవియర్ దొహర్తి.

న్యూజిలాండ్: బ్రెండన్ మెక్కల్లమ్ (కెప్టెన్), మార్టిన్ గుప్తిల్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, కోరీ ఆండర్సన్, గ్రాంట్ ఇలియట్, ల్యూక్ రోంచీ (వికెట్ కీపర్), టామ్ లాథమ్, మిచెల్ , నాథన్ మెక్కల్లమ్, కైల్ మిల్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, డేనియల్ వెట్టోరి , ట్రెంట్ బౌల్ట్.


All you need to know about ICC World Cup 2015 Final

మ్యాచ్ అధికార ప్రతినిధులు:

* మైదానపు అంపైర్లు: కుమార ధర్మసేన (శ్రీలంక), రిచర్డ్ కెట్టల్ బోర్గ్ (ఇంగ్లాండ్)
* థర్డ్ అంపైర్ - మాయరే ఎరాస్మస్ (సౌత్ ఆఫ్రికా)
* ఫోర్త్ అంపైర్ - ఇయాన్ గౌల్డ్ (ఇంగ్లాండ్)
* మ్యాచ్ రిఫరీ - రంజన్ మదుగలే (శ్రీలంక)


ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ స్టాటటిక్స్:

అస్టేలియా:
అత్యధిక పరుగులు - స్టీవ్ స్మిత్ (346 పరుగులు)
అత్యధిక స్కోరు - 178 - డేవిడ్ వార్నర్
ఎక్కువ సిక్స్‌లు - 14 - గ్లెన్ మాక్స్వెల్
ఎక్కువ ఫోర్లు - 35 - మాక్స్వెల్
ఎక్కువ యాభైలు - 3 - స్మిత్
ఉత్తమ స్ట్రయిక్ రేటు - 182.02 - మాక్స్వెల్
ఉత్తమ సగటు - 64.80 - మాక్స్వెల్
అత్యధిక వికెట్లు - మిచెల్ స్టార్క్ (20 వికెట్లు)
ఉత్తమ బౌలింగ్ - 6/28 - స్టార్క్
చాలా మైడెన్స్ - 3 - జోష్ హెజెల్‌వుడ్
ఉత్తమ సగటు - 10.02 - స్టార్క్

న్యూజిలాండ్:
అత్యధిక పరుగులు - మార్టిన్ గుప్తిల్ (532 పరుగులు)
అత్యధిక స్కోరు - 237 * - గుప్తిల్
ఎక్కువ సిక్స్‌లు - 17 - బ్రెండన్ మెక్కలమ్
ఎక్కువ ఫోర్లు - 58 - గుప్తిల్ చాలా యాభైల - 4 - మెక్కల్లమ్
ఉత్తమ స్ట్రయిక్ రేటు - 191.81 - మెక్కల్లమ్
ఉత్తమ సగటు - 76 - గుప్తిల్
అత్యధిక వికెట్లు - ట్రెంట్ బౌల్ట్ (21 వికెట్లు)
ఉత్తమ బౌలింగ్ - 7/33 - టిమ్ సౌథీ
ఎక్కువ మైడెన్స్ - 14 - బౌల్ట్
ఉత్తమ సగటు - 15.76 - బౌల్ట్
ఉత్తమ ఆర్ధిక - 3.98 - డేనియల్ వెట్టోరి


All you need to know about ICC World Cup 2015 Final

పైనల్‌కు ఎలా వచ్చారు?
* అస్టేలియా (6 గెలుపు, 1 ఓటమి, 1 ఫలితం తేలలేదు)

గేమ్ 1 - ఇంగ్లాండ్‌పై 111 పరుగులు విజయం
గేమ్ 2 - వర్షం కారణంగా మ్యాచ్ రద్దు (Vs బంగ్లాదేశ్)
గేమ్ 3 - న్యూజిలాండ్‌పై 1 వికెట్ తేడాతో విజయం
గేమ్ 4 - ఆఫ్గనిస్తాన్‌పై 275 పరుగులు విజయం
గేమ్ 5 - శ్రీలంకపై 64 పరుగుల తేడాతో విజయం
గేమ్ 6 - స్కాట్లాండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం
గేమ్ 7 - క్వార్టర్ ఫైనల్ - పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం
8 - సెమీ-ఫైనల్ -భారత్ పై 95 పరుగుల తేడాతో విజయం

* న్యూజిలాండ్ (8 వరుస విజయాలు)

గేమ్ 1 - శ్రీలంకపై 98 పరుగులు విజయం
గేమ్ 2 - స్కాట్లాండ్ పై 3 వికెట్ల తేడాతో విజయం
గేమ్ 3 - ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం
గేమ్ 4 - ఆస్ట్రేలియా 1 వికెట్ తేడాతో విజయం
గేమ్ 5 - ఆఫ్గనిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో విజయం
గేమ్ 6 - బంగ్లాదేశ్ పై 3 వికెట్ల తేడాతో విజయం
గేమ్ 7 - క్వార్టర్ ఫైనల్ - వెస్టిండిస్ పై 143 పరుగుల తేడాతో విజయం
8 - సెమీ-ఫైనల్ - దక్షిణ ఆఫ్రికాపై 4 వికెట్లు తేడాతో విజయం (డక్వర్త్ / లూయిస్ పద్ధతి)


ఐసీసీ వరల్డ్ కప్ బహుమతి:

* గెలిచిన వారికి - $3,250,000
* ఓడివారికి - $1,500,000


గతంలో వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లు:

* క్లైవ్ లాయిడ్ (వెస్ట్ ఇండీస్) - 1975, 79
* కపిల్ దేవ్ (భారతదేశం) - 1983
* అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 1987
* ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్) - 1992
* అర్జున రణతుంగ (శ్రీలంక) - 1996
* స్టీవ్ వా (ఆస్ట్రేలియా) - 1999
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 2003, 2007
* ధోనీ (భారతదేశం) - 2011


గత వరల్డ్ కప్ ఛాంపియన్లు:

* 1975 - వెస్ట్ ఇండీస్
* 1979 - వెస్ట్ ఇండీస్
* 1983 - భారతదేశం
* 1987 - ఆస్ట్రేలియా
* 1992 - పాకిస్తాన్
* 1996 - శ్రీలంక
* 1999 - ఆస్ట్రేలియా
* 2003 - ఆస్ట్రేలియా
* 2007 - ఆస్ట్రేలియా
* 2011 - భారతదేశం


ఐసీసీ వరల్డ్ కప్ 2019ని ఇంగ్లాండ్ నిర్వహించనుంది:

ఎక్కువ వరల్డ్ కప్స్ కలిగి ఉన్న దేశాలు:

* ఆస్టేలియా - 4
* వెస్టిండిస్, భారత్ - 2
* శ్రీలంక, పాకిస్ధాన్ - 1


గత వరల్డ్ కప్స్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గ్రహీతలు (1975 నుంచి 2011)

* 1975 - క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్) 102 Vs ఆస్ట్రేలియా
* 1979 - వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్) 138 * Vs ఇంగ్లాండ్
* 1983 - మొహిందర్ అమర్నాథ్ (భారతదేశం) 26, 3/12 Vs వెస్టిండిస్
* 1987 - డేవిడ్ బూన్ (ఆస్ట్రేలియా) 75 Vs ఇంగ్లాండ్
* 1992 - వసీం అక్రం (పాకిస్థాన్) 33, 3/49 Vs ఇంగ్లాండ్
* 1996 - అరవింద డి సిల్వ (శ్రీలంక) 3/42 మరియు 107 * Vs ఆస్ట్రేలియా
* 1999 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 4/33 Vs పాకిస్తాన్
* 2003 - రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 140 * Vs భారతదేశం
* 2007 - ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) 149, వికెట్ కీపర్‌గా 3 క్యాచ్‌లు
* 2011 - మహేంద్ర సింగ్ ధోని (భారతదేశం) 91 *, వికెట్ కీపర్‌‌గా 1 క్యాచ్


వరల్డ్ కప్ ట్రోఫీ గురించి:

ప్రస్తుత వరల్డ్ కప్ ట్రోపీ 1999 ఛాంపియన్ల కోసం రూపొందించబడింది. ఆ తర్వాత నుంచి నిర్వహించిన వరల్డ్ కప్స్‌కు ప్రత్యేకించి ట్రోఫీలను రూపొందించారు. ఈ వరల్డ్ కప్ ట్రోఫీలను లండన్‌లో రెండు నెలలు పాటు శ్రమించి తయారు చేస్తారు. ప్రస్తుత ట్రోఫీని వెండి, గిల్ట్ తయారు చేశారు. ఒక మూడు వెండి నిలువు వరుసలపై గోల్డెన్ గ్లోబ్ ఉంచబడింది.

ఈ మూడు నిలువ వరుసలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌కు సూచిక. ఇక గ్లోబ్ బంతికి అర్ధం వచ్చేలా ఉంచారు. దీని ఎత్తు 60 సెంమీ. బరువు సుమారుగా 11 కేజీలు. ట్రోఫీ క్రింద భాగంలో గత విన్నర్స్ గురించి వివరించేలా ఉంటుంది. సుమారు 20 శాసనాలకు సరిపడ స్ధానం ఉంటుంది. ఓరిజినల్ ట్రోఫీని ఐసీసీ తన వద్దే ఉంచుకుంటుంది. దాని ప్రతిరూపాన్ని విజేత జట్టు పేర్లతో రూపొందించి జట్టుకు అందిస్తుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X