న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్: ఏటీపీ ర్యాంకుల్లో టాప్ 10లోకి ఫెదరర్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ కోసం ఫెదరర్, నాదల్‌ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో నాదల్‌పై వి

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో సుదీర్ఘ విరామం తర్వాత గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ కోసం ఫెదరర్, నాదల్‌ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో నాదల్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఫెదరర్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లోనే ‌ఛాంపియన్‌గా అవతరించి తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ ఏకంగా ఏడు స్థానాలను మెరుగుపరచుకున్నాడు. తద్వారా 17వ ర్యాంకు నుంచి 10వ ర్యాంక్‌కు చేరుకొని మళ్లీ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు.

Australian Open win helps Roger Federer return to top 10 in ATP rankings

ప్రస్తుతం ఫెదరర్ ఖాతాలో ఇప్పుడు 3,260 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఫెదరర్ చేతిలో ఓడిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (4,385) మూడు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌లో నిలిచాడు. 11,540 పాయింట్లతో స్కాట్లాండ్‌కు చెందన ఆండీ ముర్రే నంబర్‌వన్ ర్యాంక్‌ స్ధానంలో నిలవగా, సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ 9,825 పాయింట్లతో రెండోర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

స్టానిస్లాస్ వారింకా (స్విట్జర్లాండ్, 5,695), మిలోస్ రవోనిక్ (కెనడా, 4,930), నిషికొరి (జపాన్, 4,830)లు వరుసగా 3, 4, 5 ర్యాంకులతో నిలిచారు. మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి రికార్డుస్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ 7,780 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది.

ఏటీపీ ర్యాంకింగ్స్, పాయింట్ స్కోర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. ఆండీ ముర్రే (స్కాట్లాండ్) 11,540 పాయింట్లు
2. నోవాక్ జొకోవిక్ (సెర్బియా) 9,825
3. స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 5,695
4. మిలోస్ రావ్నిక్ (కెనడా) 4,930
5. కీ నిషికోరిని (జపాన్) .4,830
6. రాఫెల్ నాదల్ (స్పెయిన్) 4,385
7. మారిన్ సిలిక్ను (క్రొయేషియా) 3,560
8. డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 3,505
9. గేల్ మొన్ఫిల్స్ (ఫ్రాన్స్) 3,445
10. రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 3,260

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X