న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షట్లర్ సమీర్ వర్మకు వీసా కష్టం: కెనడా ఓపెన్‌కు దూరం

భారత షట్లర్లకు వీసా కష్టాలు తప్పడం లేదు. సరైన సమయంలో వీసా రాకపోవడంతో స్టార్ షట్లర్ సమీర్ వర్మ వచ్చే వారంలో మొదలుకానున్న కెనడా గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత షట్లర్లకు వీసా కష్టాలు తప్పడం లేదు. సరైన సమయంలో వీసా రాకపోవడంతో స్టార్ షట్లర్ సమీర్ వర్మ వచ్చే వారంలో మొదలుకానున్న కెనడా గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంపై సమీర్ వర్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

'వీసా సకాలంలో అందకపోవడంతో కెనడా ఓపెన్ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. చాలా నిరాశగా ఉంది. ఈ టోర్నీలో ఆడేందుకు ఎంతగానో ఎదురుచూశాను' అని సమీర్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Badminton: Sameer Verma withdraws from Canada Open due to visa issue

ఓ అంతర్జాతీయ అథ్లెట్ అయిన తాను వీసా సమస్యను ఎదుర్కొని ఉండాల్సింది కాదని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే కెనడా ఓపెన్‌కు దూరమవడంతో ఆ తర్వాతి వారంలో మొదలయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రీకి సిద్ధమవుతున్నట్లు సమీర్ తెలిపాడు.

కాగా, భారత షట్లర్లు కశ్యప్, ప్రణయ్, సిక్కిరెడ్డి కెనడా ఈవెంట్‌కు సంబంధించి వీసా సమస్యలు తలెత్తడంతో విదేశాంగశాఖ, క్రీడాశాఖలకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే వాళ్లకు వీసాలు మంజూరవడంతో సకాలంలో కెనడాకు బయల్దేరి వెళ్లారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X