న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్‌ఎల్‌కు బాలీవుడ్‌ ధగధగలు: రేపే ఐఎస్‌ఎల్‌ - 3 షురూ!

By Pratap

గౌహతి: ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవానికి వేదికైంది సరూసజాయిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్‌ స్టేడియం. తాజాగా మరో సంరంభం నిర్వహణకు సన్నద్ధమవుతున్నది. శనివారం ఐఎస్‌ఎల్‌ - 3 ఎడిషన్‌ ప్రారంభోత్సవ సంబురాలకు పలువురు ప్రముఖ బాలీవుడ్‌ నటులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.

500 మంది కళాకారులతో నిర్వహించే సాంస్కృతి కార్యక్రమాల్లో బాలీవుడ్‌ హార్ట్‌ రోబ్స్‌ అలియాభట్‌, జాక్విలిన్‌ ఫెర్నాండెస్‌, వరుణ్‌ ధావన్‌ తదితరులు వేదికను ఉర్రూతలూగించనున్నారు. నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి, కేరళ బ్లాక్‌ బస్టర్స్‌ ఎఫ్‌సి మధ్య ప్రారంభ మ్యాచ్‌ సందర్భంగా శనివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

మ్యాచ్‌ ఉన్నందున సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 6.15 గంటలకు వాయిదా పడే అవకాశముందని టీవీ చానెళ్లు చెప్తున్నాయి. కేరళ బ్లాక్‌ బస్టర్స్‌ ఎఫ్‌సి యజమాని, భారత క్రికెట్‌ ఆరాధ్య దైవం సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Bollywood glamour to add spice in ISL-3 opening ceremony

ఐఎస్‌ఎల్‌ - 3 ఎడిషన్‌ ప్రారంభోత్సవ వేడుకల నిర్వహణ తనకు గర్వంగా ఉన్నదని నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి యజమాని, బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం పేర్కొన్నారు. ఈ వేడుక తనకు, తన జట్టు, ఈశాన్య భారత రాష్ట్రాలకు పెద్ద వేడుక అని అన్నారు. ఈశాన్య భారత రాష్ట్రాల్లోని ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు తమ పట్ల ఎంతో ప్రేమానురాగాలు కనబరిచేవారని, ఎల్లవేళలా మద్దతునిచ్చే వారని ఓ ప్రకటనలో తెలిపారు.

ఐఎస్‌ఎల్‌ - 3 ప్రారంభోత్సవ వేడుకల నిర్వహణతో ఈశాన్య భారతంలోని రాష్ట్రాలు, ప్రాంతాలపై యావత్‌ ప్రపంచదేశాల దృష్టి పడుతుందని జాన్‌ అబ్రహం పేర్కొన్నారు. తద్వారా అత్యధి యువకులు తమ వృత్తిగా ఫుట్‌బాల్‌ను స్వీకరించే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీతోపాటు ఆయన భార్య - రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ సంస్థ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ కూడా ప్రారంభోత్సవ వేడుకలకు ఆకర్షణ కానున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐఎంజి సంయుక్త వెంచరే ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ. ఈ సంస్థతోపాటు స్టార్‌ ఇండియాలకు మిరుమిట్లు గొలిపేలా ఎంతో అందమైన ఆట పట్ల ఈశాన్య రీజియన్‌లో ఆసక్తి కల్పించేలా ఐఎస్‌ఎల్‌ - 3 ఎడిషన్‌ ప్రారంభోత్సవ వేడుకల నిర్వహణ హక్కులు కట్టబెట్టింది నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సి జట్టు యాజమాన్యం.

గత ఏడాది సెమీ ఫైనల్‌ బెర్త్‌ పొందడంలో విఫలమైన నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌, కేరళ బ్లాక్‌బస్టర్స్‌ జట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, థాయిలాండ్‌లలో ప్రీ సీజన్‌ శిక్షణ పొందాయి. తద్వారా ఐఎస్‌ఎల్‌ - 3 సీజన్‌లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X