న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరీస్ విజయం: వన్డేలకు గుడ్‌బై చెప్పిన మెకల్లమ్

హామిల్టన్: ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వన్డేతో న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడేశాడు. సిరీస్ విజయంతో బ్రెండన్ మెకల్లమ్ తన వన్డే కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ దక్కించుకుంది.

సోమవారం జరిగిన మ్యాచులో 23 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్.. 246 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటై 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 2-1 తేడాతో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను చేజిక్కించుకుంది.

164/5తో ఓ దశలో గెలుపు దిశగా పయనించిన ఆస్ట్రేలియా మిచ్ మార్ష్ వికెట్ పడటంతో పతనం ప్రారంభమైంది. అయితే మార్ష్ ఔటవడం కొంత వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు మిగితా వికెట్లను త్వరగా పడగొట్టడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. కాగా, మార్ష్ ఔటవడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Brendon McCullum gets winning farewell as NZ seal series against Australia

ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచులో మెకల్లమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే 47 పరుగులు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మెకల్లమ్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సులున్నాయి. కాగా, ఈ సిక్సులతో మొత్తం 260 వన్డేలలో 200 సిక్సులు కొట్టిన ఘనత సాధించాడు.

షాహిద్ అఫ్రిదీ 351 అగ్రస్థనంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో సనత్ జయసూర్య(270), క్రిస్ గేల్(238) ఉన్నారు. మెకల్లమ్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

'నేను 14ఏళ్లపాటు న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ వన్డేలు ఆడటం నా అదృష్టం. ఎంతో మంది దిగ్గజాలతో ఆడాను' అని మెకల్లమ్ తెలిపాడు. 'ఆస్ట్రేలియాతో కొత్త ఉత్సాహంతో ఆడతాం. 80శాతం మా జట్టు అద్భుతంగా ఆడింది' అని మెకల్లమ్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X