న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

22ఏళ్ల నిరీక్షణ: కెప్టెన్ కోహ్లీ చరిత్ర తిరగరాస్తాడా?

By Nageswara Rao

బెంగుళూరు: టీమిండియా క్రికెట్‌లో ఇటీవల కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. తక్కువ కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలుగుతున్నాడు. త్వరలో శ్రీలంకలో జరగనున్న టెస్టు సిరిస్‌లో విజయం సాధించి 22 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం పలుకుతాడా? లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి పరీక్ష ఆగస్టు 12న ప్రారంభం కానుంది. శ్రీలంకతో ఆడనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టు గల్లేలో ఆరోజే ప్రారంభం కానుంది. అంతేకాదు కోహ్లీకి ఈ టెస్టు సిరిస్ ఎంతో ముఖ్యమైంది. అంతక ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌కి ప్రాతినిధ్యం వహించాడు.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో శ్రీలంకలో టెస్టు సిరిస్ గనుక టీమిండియా నెగ్గితే టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. మొహమ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో 1993లో టీమిండియా లంకపై 1-0తో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగు సార్లు టీమిండియా ప్రయత్నించినా శ్రీలంకపై విజయం సాధించలేదు.

Can captain Virat Kohli help India end 22-year wait in Sri Lanka?

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బ్యాటింగ్‌ శైలి మార్చుకుంటారా అని కోహ్లిని ప్రశ్నిస్తే.. బ్యాట్స్‌మన్‌గా ఈ శైలితోనూ బాధ్యతాయుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాను. మ్యాచ్‌ గెలవాలన్న లక్ష్యంతోనే నేనెప్పుడూ ఆడతాను. జట్టు బాధ్యతను బోర్డు నాకప్పగించడానికి కూడా ఇదే ప్రధాన కారణమని నేను భావిస్తాను. కాబట్టి శైలి మార్చుకునే అవకాశమే లేదు. నేనెప్పుడూ వంద శాతం ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తా. ఇక అదనపు ప్రయత్నం అంటూ ఏముంటుంది?'' అన్నాడు.

శ్రీలంకలో టీమిండియా రికార్డు (టెస్టుల్లో)

1985 - Lost 0-1 (3-match series)
1993 - Won 1-0 (3)
1997 - Drawn 0-0 (2)
1999 (Asian Test Championship) - Drawn (1)
2001 - Lost 1-2 (3)
2008 - Lost 1-2 (3)
2010 - Drawn 1-1 (3)
2015 - ? (3)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X