న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెప్పకుండానే: ధోనీ వ్యూహానికి చిక్కిన క్రిస్ గేల్, భారత్‌పై అంతంతే

By Srinivas

పెర్త్: ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో క్రిస్ గేల్ మరోసారి నిరాశపరిచాడు. వెస్టిండీస్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్ అయిదవది. దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న క్రిస్ గేల్.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తప్ప ఎందులోను ఆకట్టుకోలేదు. విఫలమయ్యాడు.

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగుతాడని వెస్టిండీస్ అభిమానులు, గేల్ అభిమానులు ఆకాంక్షించారు. కాని ఈ రోజు కూడా విఫలమయ్యాడు. భారత్ పైన గేల్ రికార్డులు ఆశించిన స్థాయిలో లేవు. భారత్ పైన గేల్ రికార్డ్.. 36 మ్యాచ్‌లలో 33.88 సగటుతో 1220 పరుగులతో ఉంది. ఇది అంత గొప్ప రికార్డ్ కాదని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా విఫలమయ్యాడు.

రెండు రోజుల క్రితం భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. క్రిస్ గేల్ గురించి మాట్లాడుతూ.. గేల్, డివిల్లియర్స్ లాంటి వాళ్లు రెచ్చిపోతే తామేం చేయలేమని వ్యాఖ్యానించారు. వారి కోసం ముందస్తు ప్రణాళికలు పని చేయవని చెప్పారు. అప్పటికప్పుడే ప్రణాళికలతో వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డారు.

Chris Gayle brings up world record for tournament sixes but out early in bizarre innings

ధోనీ వ్యాఖ్యలు భారత అభిమానులు ఆనందించేలా లేకపోయినప్పటికీ.. ఆ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని గేల్ ఆట గురించి తెలిసిన వారెవరైనా చెబుతారు. గేల్ తనదైన రోజు వస్తే ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలుసు. అయితే, అన్ని సమయాల్లో అలా రెచ్చిపోయి ఆడతాడని లేదు. ఏదెలా ఉన్నా ధోనీ తాను చెప్పినట్లుగా.. ముందస్తు ప్రణాళిక లేకుండానే.. మ్యాచ్ సందర్భంగానే వ్యూహంతో గేల్‌ను అవుట్ చేశారని అంటున్నారు.

గేల్‌ను అవుట్ చేసేందుకు భారత్ పన్ని వ్యూహం పూర్తిగా విజయవంతమైంది. పొడగరిగా ఉండే గేల్‌కు బంతిని ఏ మాత్రం షాట్ కొట్టే అవకాశం ఇవ్వకుండా శరీరం మీదకి బౌన్స్ చేయడంతో... గేల్ అవుటా కావడానికి ముందే మూడు క్యాచ్‌లు ఇచ్చాడు. గేల్ కూడా తన వ్యూహం మార్చి వికెట్లకి దూరంగా జరిగి షాట్లు కొట్టే ప్రయత్నం చేశాడు. గేల్ ఎటు జరిగితే.. అటువైపు బౌలర్లు బంతిని సంధించడంతో అతనికి అవకాశం దొరకలేదు. గేల్ షమీ బౌలింగులో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

గేల్ తొలి పరుగు తీసేందుకు పదకొండు బంతులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎనిమిదో ఓవర్ ప్రారంభం అయ్యే సమయానికి గేల్ వ్యక్తిగత పరుగులు 2. అయితే, ఈ ఓవర్లో గేల్ 4, 2, 6, 1 కొట్టాడు. దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి అతని వ్యక్తిగత పరుగులు 15కు చేరాయి. కాగా, గేల్ అవుటయ్యే ప్రమాదం నుండి పలుమార్లు బయటపడ్డాడు. ఆ తర్వాత 27 బంతుల్లో 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X