న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నన్ను ప్రపంచ నెం.1 చేసేందుకు సన్నబడ్డారు: కోచ్‌పై సైనా నెహ్వాల్

న్యూఢిల్లీ: తాను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించడం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తాను ప్రపంచ నెంబర్ 1 కావడానికి తన కోచ్ విమల్ కుమార్ కారణమని తెలిపింది. చైనా క్రీడాకారిణిలను అధిగమించడమే కాకుండా, చరిత్ర సృష్టించేందుకు ఆయన సహకరించారని తెలిపింది.

'నేను సాధించిన ఘనతకు కారణం నా గురువు విమల్ కుమార్. నాకు శిక్షణ ఇచ్చేందుకు ఆయనెంతో కష్టపడ్డారు. ఈ క్రమంలో ఆయన తన బరువును కూడా తగ్గిపోయి సన్నబడ్డారు. ప్రకాశ్ సార్ సలహాలు కూడా నాకు ఎంతో సహకరించాయి' అని సైనా నెహ్వాల్ తెలిపింది.

'నేను ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సాధించిన తర్వాత నా తల్లిదండ్రులకు ఫోన్ చేశాను. కానీ బిజీ వచ్చింది. ఆ తర్వాత ఫోన్ చేసి నేను విషయం చెప్పాను. నా తల్లిదండ్రులు ఎంతో సాధారణంగా ఉంటారు. నేను ఫోన్ చేసి విషయం చెప్పగానే.. వారు నీవు భోంచేశావా? అని అడిగారు. నేను సాధించిన ప్రపంచ నెంబర్ 1 వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది' అని సైనా తెలిపింది.

 Saina Nehwal

ఇండియన్ ఓపెన్ సెమీ ఫైనల్లో విజయం తర్వాత తాను నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నట్లు వచ్చిన వార్తలు మొదట నమ్మలేదని చెప్పింది. క్రికెట్‌ను అభిమానించే దేశమైనా ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుతోపాటు ఇండియన్ ఓపెన్‌ను కూడా సాధించి భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖులు నుంచి అభినందనలు అందుకుంది. 'విజయం తర్వాత నేను బాగా ఆడాలని అనుకున్నాను' అని సైనా చెప్పింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి భారతీయురాలిగా తాను నిలవడం తనకెంతో గర్వకారణం అని సైనా తెలిపింది. కాగా, ఇండియా ఓపెన్‌కు ఆమె 25వ జన్మదిన వేడుకలను జరుపుకుంది.

కొన్ని సంవత్సరాల క్రితం మూడు వరుస టోర్నీలను గెల్చుకున్న సైనా.. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సాధించింది. అయితే ప్రపంచ నెంబర్ 3 ర్యాంకును సాధించిన తనకు.. నెంబర్ వన్ ర్యాంకును కూడా సాధించలననే నమ్మకం కలిగిందని సైనా చెప్పింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సాధించడమంటే ఏ షట్లర్ కైనా సులభమైన పనేమీ కాదని చెప్పింది.

నిరుడు 9వ ర్యాంకులో ఉన్న తాను.. ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. 'ఏవరికైనా ప్రపంచ నెంబర్ 1 కావాలనే కల ఉంటుంది, అది నేను చేసి చూపించాను' సైనా గర్వంగా తెలిపింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X