న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాధృచ్చికం: డే/నైట్ వన్డే, టెస్టు మ్యాచ్ ఒకే రోజున

By Nageswara Rao

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రయోగానికి నవంబర్ 27 నాంది పలికింది. సంప్రదాయ ధోరణితో 138 ఏళ్లు కొనసాగిన టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా అంతర్జాతీయ డే/నైట్ టెస్టు మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు. ఆస్టేలియా, న్యూజిలాండ్ మధ్య ఈరోజు అడిలైడ్‌లో డే/నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌కు ఎరుపు, తెలుపు బంతులను మాత్రమే ఉపయోగించారు. అయితే ఈ డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో మొదటిసారిగా గులాబీ రంగు బంతిని వివియోగిస్తున్నారు. కాగా, సరిగ్గా ఇదే రోజున(నవంబర్ 27) అంతర్జాతీయ డే/నైట్ వన్డే కూడా ప్రారంభం కావడం విశేషం.

అంతర్జాతీయ డే/నైట్ వన్డే మ్యాచ్ 1979లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్టేలియా, వెస్టిండిస్ జట్లు తలపడ్డాయి. అటు టెస్టు, ఇటు వన్డే క్రికెట్‌ డే/నైట్ మ్యాచ్‌లో ఆస్టేలియా భాగస్వామ్యమైంది. తొలి అంతర్జాతీయ డే/నైట్ వన్డేలో ఆస్టేలియా 5 వికెట్ల తేడాతో వెస్టిండిస్‌పై విజయం సాధించింది.

Coincidence: First-ever day-night ODI, Test played on same date - November 27

అంతర్జాతీయ డే/నైట్ వన్డే మ్యాచ్‌లో ఆస్టేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాఫెల్ ఫ్లడ్ లైట్ల వెలుగులో తొలి అర్ధశతకాన్ని సాధించిన ఆటగాడు. చరిత్ర సృష్టించిన ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టుకు క్లైవ్ లాయిడ్ నాయకత్వం వహించాడు.

ఈరోజు ప్రారంభమైన అంతర్జాతీయ డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేశారు. సాధారణంగా టెస్టు మ్యాచ్‌ల్లో తొలుత భోజన విరామం ఇచ్చిన తర్వాత టీ బ్రేక్ ఇస్తారు.

కానీ ఈ మ్యాచ్‌లో మొదటి సెషన్‌లో టీ విరామం ఆ తర్వాత రెండో సెషన్‌లో భోజన విరామం ఇచ్చారు. ఇక గులాబీ బంతితో మొట్టమొదటి బంతిని విసిరింది ఆస్టేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కాగా, ఆ బంతిని ఎదుర్కొంది న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గుప్తిల్.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X