న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఓ జీవన విధానం: అందర్నీ కలిపే ఆట

హైదరాబాద్: వివిధ మతాలు, కులాలు, శాఖలతో భారతదేశం ఎంతో వైవిధ్యమైనది. అయితే క్రికెట్ మాటకొస్తే మాత్రం వీరందరూ ఒకే మాటగా కలిసికట్టుగా నిలబడతారు. ఈ క్రికెట్ భక్తిలో పిచ్చి, మద్దతు, కోపం, ఆనందం, భావోద్వేగం, ఉత్సాహం కలగలిపి ఉంటాయి. ఇక్కడ క్రికెట్ అంటే ఒకే ఆట మాత్రమే కాదు, ఒక మతం కూడా.

Cricket as a way of life in India

క్రికెట్ మ్యాచ్ ప్రారంభమవుతుందనగానే అభిమానులందరూ టీవీల ముందు కూర్చుంటారు. మ్యాచ్ రిపోర్టు నుంచి చివరి దాకా వీక్షిస్తారు. టీమిండియాకు ఆడే 11మంది ఆటగాళ్ల భుజాలపై కొన్ని కోట్ల మంది అంచనాలు ఉంటాయి.

భారతదేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెటే దేశంలో ఎక్కువ మంది అభిమానించే ఆటగా మారిపోయింది. క్రికెట్ జరుగుతున్న సమయంలో 'బీడ్ బ్లూ' నినాదాలు చేస్తూ సందడిగా ఉంటారు అభిమానులు.

Cricket as a way of life in India

భారతదేశంలో క్రికెట్ ఒక మతంగా మారడానికి గల కారణాలను కొన్ని పరిశీలిస్తే...

1. క్రికెట్ దేవుడు సచిటెండూల్కర్

భారతేదశంలో ఎంతో క్రేజ్ వున్న క్రికెట్‌కు ఎవరేమి చెప్పిన సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడే. దేశంలోని ఏ చిన్నారి అయినా సచిన్‌ను ఆదర్శంగా తీసుకుని బ్యాట్ పడతాడు. అతని ఆటను చూస్తూ అతనంతటివాడు కావాలని కలలు కంటాడు.

2. వేడుకల వేళ

భారతదేశంలో వేడుకలకు ఒక కారణం కావాలి. అది క్రికెట్ కంటే మించినది ఏముంటుంది? ప్రపంచ కప్ గెలిచినా లేదా పాకిస్థాన్ జట్టుపై గెలిచినా దేశంలోని అభిమానులు ఎనలేని ఉత్సాహంతో చిందులేస్తారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నినాదాలు చేస్తూ ఊగిపోతారు.

3. మతాలకతీతంగా ఏకమవుతారు

భారతదేశంలో క్రికెట్ క్రేజ్ విషయానికస్తే.. మతాలు వెనకసీటులోకి వెళ్లిపోవాల్సిందే. అందరూ క్రికెట్ భాషలోనే మాట్లాడతారు. అక్కడే ఒకే మతం ఉంటుంది. అది క్రికెట్. ఇక్కడ అందరూ కలిసిపోతారు.

4. హాలిడే

ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ కోసం ప్రజలు తమ విధులను ఎగ్గొట్టేందుకు కూడా వెనకడుగు వేయరు. కొన్ని కార్యాలయాలు జాతీయ సెలవుదినంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంటాయి. భారతదేశంలో క్రికెట్ అంటే అంత అభిమానం మరి.

5. భారత్ వర్సెస్ పాకిస్థాన్

దాయాది దేశం పాకిస్థాన్ జట్టుపై టీమిండియా గెలవడం కంటే భారత క్రికెట్ అభిమానికి ఎక్కువేమి ఉండదు. అన్ని మ్యాచులు ఒక ఎత్తయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ మరో ఎత్తు. ఈ మ్యాచ్.. మ్యాచులా కాకుండా ఓ యుద్ధంలా సాగుతుంది.

6. అందరికీ నియమాలు తెలుసు

ఆఫ్‌సైడ్ కాదు, జంట తప్పులు కాదు, అల్బట్రోస్ కాదు. ప్రతీ ఒక్కరికి తెలుసు ఓ సిక్సర్, ఫుల్‌టాస్, లెగ్‌సైడ్.

7. ప్రతీ ఒక్కరి అవసరం

అది టెస్ట్ గానీ, వన్డే గానీ, ట్వంటీ20గానీ ప్రపంచంలో ఎక్కడైనా టీమిండియా ఆడుతుందంటే ఆ మ్యాచుకు సంబంధించిన స్కోరు వివరాలు క్షణక్షణానికి తెలుసుకుంటారు అభిమానులు. తమ జట్టు ఆటగాళ్లు ఎలా అడుతున్నారనే విషయం తెలుసుకుంటారు.

Cricket as a way of life in India

కానీ, టీవీల ముందు కూర్చుని మ్యాచ్ చూసే వీలులేని వారు, స్కోరు వివరాలను ఎలా తెలుసుకుంటారు? మీరు ఏదైనా పనిలో ఉన్నా, లేదా ఏదైనా సమావేశంలో ఉన్నప్పుడు ఎలా తెలుసుకుంటారు? అయితే మంచి విషయం ఏంటంటే.. ఇప్పుడు ఎన్నో యాప్స్ క్రికెట్ సమాచారాన్ని అందిస్తున్నాయి. అలాంటిదే ఒకటి యూసి క్రికెట్. ఇది క్రికెట్‌కు సంబంధించిన అప్‌డేట్సే కాకుండా మ్యాచుకు సంబంధించిన విషయాలను అందిస్తుంది.

యూసీ క్రికెట్, యూసీ బ్రోజర్‌లో ఇదొక యాప్ ఫీచర్. ఇది అన్ని క్రికెట్ మ్యాచులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. లైవ్స్ స్కోర్స్, మ్యాచ్ ప్రివ్యూలు, కామెంటరీ, ఇంటర్వ్యూస్, స్టాటిస్టిక్స్, ఫొటోలు, వీడియోలు, ఇంకా మరెన్నో విషయాలను అందజేస్తుందీ యూసీ క్రికెట్.

ఈ యాప్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచుల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. క్రికెట్ మ్యాచులకు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందవచ్చు. యూసీ క్రికెట్ యాప్ ద్వారా ప్రపంచంలోని ఏ క్రికెట్ అభిమాని అయినా ఈ యాప్ ద్వారా క్రికెట్ సమాచారాన్ని అందుకోవచ్చు. మ్యాచుకు సంబంధించిన ప్లే ప్రశ్నలు కూడా తెలుసుకోవచ్చు.

Cricket as a way of life in India

'క్రికెట్ గెస్సింగ్ గేమ్' ద్వారా వినియోగదారుడు కూడా విజేతగా నిలవొచ్చు. విజేతలు విలువైన బహుమతులను పొందవచ్చు. అభిమానుల కోసం అనేక పోటీలు నిర్వహించడబడతాయి. ఇందులో పాల్గొని అద్భుతమైన బహుమతులను గెలుచుకోవచ్చు.

ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా యూసీ క్రికెట్ యాప్‌ను ఉపయోగిస్తుండటం గమనార్హం.

'యూసీ బ్రౌజర్ ఎంతో వేగవంతమైంది. ఇదొక మంచి బ్రౌజర్. భారత మార్కెట్‌కు అనుగుణంగా రూపొందించబడింది. యూసీ బ్రౌజర్‌లో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని యువరాజ్ తెలిపాడు.

'నా పనితో చాలా బిజీగా ఉంటాను. మీ చేతిలో ఓ ఫోన్ ఉండే ఉంటుంది. ఈ బ్రౌజర్‌తో న్యూస్ చూసి చాట్ చేయవచ్చు. వేగవంతంగా పని చేయడం వల్లే యూసీ బ్రౌజర్‌ను ఇష్టపడతా. యూసీ బ్రౌజర్ క్రికెట్ అభిమాన యువతరాన్ని ఆకట్టుకునే విధంగా ఉంది' అని చెప్పాడు.

'నేను క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, క్రికెట్‌లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. అందువల్లే నేను యూసీ క్రికెట్‌ను ఇష్టపడతా. ఇందులో అప్ డేట్స్, ఫొటోలు, కామెంటరీ, బాల్ బై బాల్ అప్ డేట్స్ అందించడం జరుగుతుంది' అని తెలిపాడు.

ట్వంటీ20లు, ఓడిఐలు, టెస్టులు, ప్రస్తుతం జరుగుతున్న ఇండియా, దక్షిణాఫ్రికా సిరీస్‌కు సంబంధించిన అప్‌డేట్స్ యూసీ క్రికెట్ యాప్‌లో పొందవచ్చు. మీరు క్రికెట్ ప్రపంచాన్ని చూడాలనుకుంటే యూసీ క్రికెట్ యాప్‌ని ప్రయత్నించండి. మీరు యూసీ క్రికెట్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుని ఇప్పటివరకు చూడని క్రికెట్ సమాచారాన్ని పొందండి.

Cricket as a way of life in India

యూసీవెబ్(UCWeb) గురించి

యూసివెబ్ ఇంక్.(యూసీవెబ్) అనేది మొబైల్ ఇంటర్నెట్ సాఫ్ట్‌వేర్, సేవలు అందించే ప్రొవైడర్. 2004 నుంచి యూసీ వెబ్ సేవలు అందిస్తున్న ఈ ప్రొవైడర్ అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది.

యూసీవెబ్ ప్రధాన ఉత్పత్తి అయిన యూసీ బ్రౌజర్ 3వేల భిన్న మోడల్స్‌లో, 200లకు పైగా మొబైల్ డివైస్‌లలో లభ్యమవుతోంది. మెయిన్ స్ట్రీమ్ ఆపరేటింగ్ సిస్టంకు అనుకూలంగా ఉంటుంది ఈ బ్రౌజర్.

150దేశాల్లో 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. ఇంగ్లీష్, రష్యా, ఇండోనేషియా, వియాత్నమీస్ లతోపాటు పది భాషలలో అందుబాటులో ఉంది. యూసీ వెబ్, యూసీ బ్రౌజర్ గురించిన అదనపు సమాచారం కోసం www.ucweb.comను సంప్రదించవచ్చు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X