న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్: 10 ఆసక్తికర అంశాలు, కోహ్లీకి తొలి అనుభవం!

By Nageswara Rao

బెంగుళూరు: ఐదు నెలల తర్వాత టీమిండియా టెస్టు క్రికెట్ ఆడేందుకు బంగ్లాదేశ్‌‌కు చేరుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఫతుల్లా స్డేడియంలో జూన్ 10 నుంచి భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

టీమిండియా ఆస్టేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో జనవరి 6 నుంచి 10 వరకు చివరి టెస్టుని ఆడింది. ఆస్టేలియాలో టెస్టు సిరిస్ అనంతరం ఐసీసీ వరల్డ్ కప్ 2015లో సెమీ ఫైనల్ వరకు చేరడం, ఆ తర్వాత మే 24 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనడం మనం చూశాం.

బంగ్లాదేశ్‌తో జూన్ 10 నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్‌తో మళ్లీ టీమిండియా టెస్టు మ్యాచ్‌ని ఆడనుంది. ఈ టెస్టు మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతారు.

10 facts about India-Bangladesh Test in Fatullah

గతేడాది డిసెంబర్‌లో ఆస్టేలియా పర్యనటలో టెస్టు నుంచి కెప్టెన్ ధోని వైదొలగినట్లు ప్రకటించారు. ఇప్పడు బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు వన్డేలకు కెప్టెన్‌గా ధోని వ్యవహారించనున్నారు. భారత్-బంగ్లాదేశ్ టెస్టు నేపథ్యంలో కొన్ని ఆసక్తికర అంశాలు.

1. 2000 నుంచి భారత్ - బంగ్లాదేశ్ దేశాలు ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్‌లను ఆడాయి. రాజధాని ఢాకాలోని ఫతుల్లా స్డేడియంలో బంగ్లా-భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్.

2. బంగ్లాదేశ్‌తో టీమిండియా ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌లో ఓటమిని చవిచూడలేదు. బంగ్లా - భారత్‌ల మధ్య ఇప్పటి వరకు ఏడు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, 6 టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. ఒకటి డ్రాగా ముగిసింది.

3. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌లో విరాట్ కోహ్లీకి ఇది మొదటి టెస్టు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 33 టెస్టు మ్యాచ్‌లు ఆడారు.

4. మురళీ విజయ్, ఇషాంత్ శర్మ, హార్భజన్ సింగ్‌లకు గతంలో బంగ్లాదేశ్‌‌ టెస్టు మ్యాచ్‌లాడిన అనుభవం ఉంది.

10 facts about India-Bangladesh Test in Fatullah

5. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన జట్టులో హార్భజన్ సింగ్ అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. హార్బజన్ సింగ్‌ ఇప్పటి వరకు 101 టెస్టు మ్యాచ్‌లాడారు. రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్ధానం సంపాదించాడు.

6. బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా డైరెక్టర్, కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ఉన్నారు.

7. బంగ్లాదేశ్‌కు అంతర్జాతీయ టెస్టు హోదా వచ్చిన తర్వాత తొలి టెస్టు మ్యాచ్‌ని నవంబర్ 2000లో రాజధాని ఢాకాలోని బంగాబంధు జాతీయ స్టేడియంలో భారత్‌పై ఆడింది. ఈ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

8. బంగ్లాదేశ్‌పై అత్యధికి సెంచరీలు చేసిన ఆటగాడి రికార్డుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కలిగి ఉన్నారు. 9 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు (అత్యధిక స్కోరు 248 నాటౌట్). అంతేకాదు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా సచినే 820 పరుగులు.

9. 14 ఇన్నింగ్స్‌లో 31 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్‌పై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా పేసర్ జహీర్‌ఖాన్ ఉన్నారు. ఆ తర్వాత 4 ఇన్నింగ్స్‌లో 18 వికెట్లు తీసుకుని ఇర్ఫాన్ పఠాన్ ఉన్నారు.

10. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమండియా 3వ స్ధానంలో ఉంటే, బంగ్లాదేశ్ 9వ స్ధానంలో ఉంది.

గతంలో బంగ్లాదేశ్ - భారత్ టెస్టు సిరిస్‌ల ఫలితాలు:

2000 - India won 1-0 (1-Test series)
2004 - India won 2-0 (2 Tests)
2007 - India won 1-0 (2 Tests)
2010 - India won 2-0 (2 Tests)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X