న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: భారత్-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌పై 10 నిజాలు

By Nageswara Rao

ఐసీసీ వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా మార్చి 19 (గురువారం) బంగ్లాదేశ్‌తో రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనుంది. వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.

వరల్డ్ కప్‌లో లీగ్ మ్యాచ్‌ల్లో పూల్ బీలో భారత్ తలపడిన పాకిస్ధాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్టిండిస్, ఐర్లాండ్‌, జింబాబ్వేలను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో నిలిచింది.

10 facts about India-Bangladesh World Cup quarter-final

ఇక క్వార్టర్ ఫైనల్ విషయానికి వస్తే భారత్, పూల్ ఏలో నాల్గవ స్ధానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్స్‌లో ఆస్టేలియా లేదా పాకిస్ధాన్‌తో తలపడనుంది.

భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి 10 నిజాలు:

1. వరల్డ్ కప్ చరిత్రలో క్వార్టర్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడటం మొదటిసారి. గతంలో తలపడిన రెండు సార్లు కూడా లీగ్ మ్యాచ్‌ల్లోనే జరిగాయి.

2. వరల్డ్ కప్‌లో భారత్ - బంగ్లాదేశ్ రికార్డు 1-1. 2007 వరల్డ్ కప్‌లో లీగ్ మ్యాచ్‌లో భారత్‌ను ఇంటికి పంపడంలో బంగ్లాదేశ్‌పై ఓటమే కారణమనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. అయితే 2011లో మాత్రం బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది.

10 facts about India-Bangladesh World Cup quarter-final

3. బంగ్లాదేశ్‌పై భారత్ రెండు వరల్డ్ కప్ సెంచరీలను సాధించింది. 2011లో ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ వీరేంద్ర్ సెహ్వాగ్ 175 పరుగులు సాధించగా, విరాట్ కోహ్లీ 100 పరుగులు సాధించాడు.

4. 2007 వరల్డ్ కప్ ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డకౌట్‌గా వెనుదిరిగాడు. 2011 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ చేయలేదు.

5. వరల్డ్ కప్‌లో భారత్‌పై ఒక్క బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేయకపోవడం విశేషం. 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ తమిమ్ ఇక్బాల్ అత్యధికంగా 70 పరుగులు సాధించాడు.

10 facts about India-Bangladesh World Cup quarter-final

6. 2011 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 83 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

7. 2011 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ తరుపున ఆడిన ఆరుగురు ఆటగాళ్లు తమీమ్, ఇమ్రుల్ కయెస్, షాకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా మరియు రుబెల్ హొస్సేన్‌లు ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఆడుతున్నారు. ఇక భారత్ తరుపున విరాట్ కోహ్లీ, ధోని మాత్రమే ఉన్నారు.

8. ఇక వన్డే క్రికెట్‌లో 29 సార్లు భారత్, బంగ్లాదేశ్ తలపడగా కేవలం మూడు సార్లు మాత్రమే బంగ్లాదేశ్... భారత్‌పై విజయం సాధించింది. టీమిండియా బంగ్లాదేశ్‌పై 24సార్లు గెలుపొందగా, 2 సార్లు ఫలితం తేలలేదు.

9. ఆస్టేలియాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో భారత్, బంగ్లాదేశ్‌లు క్వార్టర్ ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి.

10. మార్చి 2012లో జరిగిన ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 100వ (147 బంతుల్లో 114 పరుగులు) సెంచరీని సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:11 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X