న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డే: బంగ్లాదేశ్ చేతిలో ధోనీ సేన చిత్తు

By Nageswara Rao

ఢాకా: తొలి వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్ మట్టికరిచింది. మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఘనంగా ప్రారంభించింది. మిర్పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో మోర్తజాసేన 79 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యలో నిలిచింది. గురువారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో తమీమ్‌ ఇక్బాల్‌ (60), సౌమ్య సర్కార్‌ (54), షకీబల్‌ (52) అర్ధ సెంచరీల మోత మోగించి బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.

స్పిన్నర్‌ అశ్విన్‌ మూడు వికెట్లు తీసుకోగా భువనేశ్వర్‌, ఉమేష్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత పేసర్‌ ముస్తాఫిజుర్‌ (5/50), తస్కిన్‌ అహ్మద్‌ (2/21), షకీబల్‌ (2/33) ధాటికి లక్ష్య ఛేదనలో భారత్‌ 46 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది.

రోహిత్‌ శర్మ (63), రైనా (40) పోరాడినా ఫలితం దక్కలేదు. కోహ్లీ (1), రహానె (9), ధోనీ (5) వైఫల్యంతో భారత్ జట్టు మూల్యం చెల్లించుకుంది. ముస్తాఫిజుర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య ఈ నెల 21న రెండో వన్డే జరగనుంది.

భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా కూడా ధాటిగానే బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం చేశారు. రహ్మాన్‌ వేసిన 7వ ఓవర్‌లో రోహిత్‌ సిక్సర్‌, రెండు ఫోర్లతో ఉతికేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రోహిత్‌ 53 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. అయితే 16వ ఓవర్‌లో ధావన్‌ (30) వికెట్‌ను తీసి తస్కిన్‌ అహ్మద్‌ భారత్‌ పతనానికి మార్గం వేశాడు

ధావన్ ఔటైన తర్వాత కోహ్లీ బరిలోకి దిగాడు. అయితే తస్కిన్‌ బౌలింగ్‌లో చెత్తషాట్‌తో విరాట్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. రోహిత్‌తో పాటు రహానెను అవుట్‌ చేసి ముస్తాఫిజుర్‌ భారత్‌ను దెబ్బ తీశాడు. టీమిండియా 115 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ ధోనీ కూడా ఆదుకోలేకపోయాడు. 26 ఓవర్లకే సగం మంది బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌లో కూర్చున్నారు. ఈ దశలో రైనా, జడేజా పోరాడే ప్రయత్నం చేశారు.

విజయానికి భారత్‌ చివరి 14 ఓవర్లలో 128 రన్స్‌ చేయాల్సి వచ్చింది. ఈ దశలో 37వ ఓవర్‌లో వరుసగా రైనా, అశ్విన్‌ (0)ను అవుట్‌ చేసి ముస్తాఫిజుర్‌ భారత్ అపజయానికి మార్గం వేశాడు. స్వల్ప తేడాతో జడేజా (32)ను కూడా అతను వెనక్కి పంపాడు. ఇక ఉమేష్‌ అవుట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్ ముగిసి, ఓటమిని మూటగట్టుకుంది.

మిర్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 307 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయ లక్ష్యం 308. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులు చేసి మరో రెండు బంతులు ఉండగానే ఆలౌటైంది.

నిర్ణీత ఓవర్లలో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లలో అత్యధికంగా తమిమ్ ఇక్భాల్ 62 బంతుల్లో 60 పరుగులు చేయగా, ఆ తర్వాత సౌమ్య సర్కార్ 40 బంతుల్లో 54 పరుగులు, షకీబ్ అల్ హసన్ 68 బంతుల్లో 52 పరుగులు చేశారు.

భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, భువనేశ్వర్ కుమార్ 2, ఉమేష్ యాదవ్ 2, శర్మ, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బంగ్లాదేశ్ షబ్బీర్ రెహమాన్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన రెహమాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 42 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. షకీబ్ అల్ హాసన్ 51, నజీర్ హొస్సేన్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ 34.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 200 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షకీబ్ అల్ హాసన్ 63 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేశాడు.

వర్షం అడ్డంకిగా మారడంతో తాత్కాలికంగా నిలిచిపోయిన బంగ్లాదేశ్, భారత్ తొలి వన్డే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. వర్షం అనంతరం బంగ్లాదేశ్ మూడు వికెట్లను కోల్పోయింది.

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ రహీమ్‌ను 14 పరుగుల స్కోరు వద్ద అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో 28 ఓవర్లకుగాను బంగ్లాదేశ్ 4 వికెట్ల కోల్పోయి 162 పరుగులు చేసింది. షకీబ్ అల్ హాసన్ 15, షబ్బీర్ రెహ్మాన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

1st ODI: Bangladesh win toss, opt to bat against India

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన లిట్టస్ దాస్‌ను 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 22 ఓవర్లకు గాను 3 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది.

షకీబ్ ఉల్ హాసన్ 3, రహీమ్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 19.1 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 127 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 8, రహీమ్ 2 పరుగుతో క్రీజులో ఉన్నారు.

వర్షం అంతరాయం:

బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ని నిలుపదల చేశారు. 15.4 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ వికెట నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 52 బంతుల్లో 57 పరుగులతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 57, లిట్టన్ దాస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ సౌమ్య సర్కార్‌ను సురేష్ రైనా రనౌట్ చేయడంతో బంగ్లాదేశ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 14.2 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది.

అంతక ముందు బంగ్లాదేశ్ 100 పరుగులు మైలురాయిని దాటింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ 38 బంతుల్లో 53 పరుగులతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

నిలకడాగా బంగ్లాదేశ్ ఓపెనర్లు:

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు నిలకడగా రాణిస్తున్నారు. 11 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేశారు. ఓపెనర్లు సౌమ్య సర్కార్ 40, తమీమ్ ఇక్బాల్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే ఈరోజు జరగనుంది. బంగ్లా రాజధాని ఢాకాలోని మిర్‌పుర్‌లో ఉన్న షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తరుపు నుంచి ఇద్దరు ఆటగాళ్లు వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నారు. ఒకరు లిట్టన్ దాస్ కాగా, మరొకరు వికెట్ కీపర్ ముస్తాఫిజుర్ రహ్మాన్. తొలి వన్డేలో కెప్టెన్ ధోని ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్‌తో(భువనేశ్వర్ కుమార్, మొహిత్ శర్మ, ఉమేష్ యాదవ్) బరిలోకి దిగుతున్నారు.

బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య ఇప్పటి వరకు 29 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 25 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

జట్లు:

భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, అజింక్య రహానే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి.

బంగ్లాదేశ్: మొర్తాజా (కెప్టెన్), షకీబ్ అల్ హసన్ (వైస్ కెప్టెన్), బంగ్లా ఇక్బాల్, సౌమ్య సర్కార్, మొముల్ హక్, రహీం, షబ్బీర్ అనీసుర్ నాసిర్ హుస్సేన్, అరాఫత్ సన్నీ, టాస్క్ అహ్మద్, రూబెల్ హుస్సేన్, రోనీ, ముస్తాఫిజిర్రెహమాన్, లిట్టన్ కుమార్ దాస్.

అంపైర్లు: రాడ్ టుక్కర్ (ఆస్టేలియా)
మ్యాచ్ రిఫరీ: ఆండీ పాయ్‌క్రాప్ట్ (జింబాబ్వే)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X