న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ 'రికార్డ్' సెంచరీ వృథా, భారత్ ఓటమి: మెరిసిన బరిందర్

By Srinivas

పెర్త్: ఐదు వన్డేల్లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆసిస్ 5 వికెట్ల తేడాతో టీమిండియా పైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ఆసిస్ 4 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.

ఈ వన్డేలో... అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన భారత్ పేసర్ బరిందర్ శ్రాన్ ఆకట్టుకున్నాడు. ఆసిస్ తొలి రెండు వికెట్లు అతనే తీశాడు. ఆ తర్వాత చివరలో స్మిత్ వికెట్ తీశాడు. బరిందర్ 9.2 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు తీశాడు. ఆసిస్ టీంలో స్మిత్ (149), బెయిలీ (112), భారత్ నుంచి రోహిత్ (171) సెంచరీలు చేశారు.

1st ODI: India opt to bat first; Barinder Sran debuts

ఆసిస్ ఇన్నింగ్స్

- భారత్ తన ముందు ఉంచిన 310 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ అయిదు వికెట్లు కోల్పోయి చేధించింది. 49.2 ఓవర్లలో 310 పరుగులు చేసింది.

- 308 పరుగుల వద్ద స్మిత్ రూపంలో ఆసిస్ వికెట్ కోల్పోయింది. స్మిత్ 135 బంతుల్లో 149 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. శ్రాన్ బౌలింగులో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- అశ్విన్ బౌలింగులోనే మాక్స్‌వెల్ అవుటయ్యాడు. ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మాక్స్‌వెల్ ఆరు బంతుల్లో 6 పరుగులు చేశాడు. అందులో ఒకటి ఫోర్ ఉంది. ఇది నాలుగో వికెట్.

- అశ్విన్ బౌలింగులో బెయిలీ అవుటయ్యాడు. బెయిలీ 120 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. అశ్విన్ బౌలింగులో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇది ఆసిస్‌కు మూడో వికెట్.

- ఆసిస్ టీంలో స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ చేశాడు. స్మిత్ 97 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 39 ఓవర్లు పూర్తయ్యేసరికి బెయిలీ 113 బంతుల్లో 109 పరుగులు, స్మిత్ 100 బంతుల్లో 108 పరుగులు చేశారు.

- ఆసిస్.. వికెట్లు పోకుండా ఆచితూచి ఆడుతోంది. జార్జ్ బెయిలీ 106 బంతుల్లో సెంచరీ చేశాడు. 36వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టీవెన్ స్మిత్ 88 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

- ఆదిలోనే రెండు వికెట్ కోల్పోయినప్పటికీ ఆసిస్ ఆ తర్వాత నిలకడగా ఆడింది. 30 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

- ఆరంభ మ్యాచ్‌లోనే బరిందర్ శ్రాన్ చెలరేగిపోయాడు. రెండో వికెట్ కూడా తీశాడు. వార్నర్‌ను(10 బంతుల్లో 5పరుగులు) పెవిలియన్ చేర్చాడు. శ్రాన్ బౌలింగ్‌లో వార్నర్.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- ఆసిస్ 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. శ్రాన్ బౌలింగులో ఆరోన్ ఫించ్ అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫించ్ 11 బంతుల్లో 8 పరుగులు చేశాడు. శ్రాన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఆదిలోనే అదరగొట్టాడు.

భారత్ ఇన్నింగ్స్: 3 వికెట్లకు 309 పరుగులు

- భారత్ నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ఆసిస్ ముందు 310 పరుగుల లక్ష్యం ఉంచింది. రోహిత్ శర్మ 171 పరుగులు (13 ఫోర్లు, 7 సిక్స్‌లు), ధావన్ 9 పరుగులు, కోహ్లీ 91 పరుగులు (97 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్), ధోనీ 18 పరుగులు, జడెజా 10 పరుగులు చేశారు. ఫాల్కనర్ రెండు వికెట్లు, హాజిల్ వుడ్ ఒక వికెట్ తీశారు.

- భారత్ స్కోర్ 286 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధోనీ అవుటయ్యాడు. ధోనీ దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. అతను 13 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 18 పరుగులు చేసి, ఫాల్కనర్ బౌలింగులో బోలాండుకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- 47 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 269. రెండు వికెట్లు కోల్పోయింది. ధోనీ వచ్చీ రావడంతోనే దూకుడుగా ఆడుతున్నాడు.

- సెంచరీకి 9 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 91 పరుగులు చేసిన కోహ్లీ... ఫాల్కనర్ బౌలింగులో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- 38 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 196 పరుగులు. రోహిత్ శర్మ 126 బంతుల్లో 104 పరుగులతో, కోహ్లీ 80 బంతుల్లో 75 పరుగులతో క్రీజులో ఉన్నారు.

- రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మకు ఇది మూడో సెంచరీ. మొత్తం అతని కెరీర్లో తొమ్మిదో సెంచరీ. 123 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో రోహిత్ సెంచరీ చేశాడు.

- 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 149 పరుగులు చేసింది. కోహ్లీ 49 పరుగులు, రోహిత్ 83 పరుగులతో ఉన్నారు.

- భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 63 పరుగులు చేసింది. ఒక వికెట్ కోల్పోయింది. కోహ్లీ (12), రోహిత్ శర్మ (37)తో క్రీజులో ఉన్నారు.

- భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ జట్టు స్కోర్ 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుటయ్యాడు. ధావన్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ బౌలింగులో మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు. ధావన్ 22 బంతుల్లో ఒక ఫోర్‌తో 9 పరుగులు చేశాడు.

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ యంగ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్‌మెన్ బరిందర్ శ్రాన్ అంతర్జాతీయ క్రికెట్ తొలిసారి ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మంగళవారం జరుగుతోంది.

బరిందర్ శ్రాన్ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున కూడా ఇద్దరు కొత్తగా ఆడుతున్నారు. ఫాస్ట్ బౌలర్స్ జోయెల్ పారిస్, స్కాట్ బోలాండులు ప్రత్యర్థి జట్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించారు.

భారత్ స్క్వాడ్: ధోనీ (కెప్టెన్, కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, గుర్ కీరత్ సింగ్ మన్, మనీష్ పాండే, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, బరిందర్ శ్రాన్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, రిషి ధావన్

ఆస్ట్రేలియా స్క్వాడ్: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, జార్జ్ బెయిలీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, జేమ్స్ ఫాల్కనర్, మాథ్యూ వాడే (వికెట్ కీపర్), కేన్ రిచర్డ్సన్, హోజిల్‌వుడ్, జోయెల్ పారిస్, స్కాట్ బోలాండ్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X