న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిపబ్లిక్ డే కానుక: తొలి టీ20లో ఆసీస్‌పై భారత్ గెలుపు

By Nageswara Rao

అడిలైడ్: ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య మంగళవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్‌పై టీమిండియా 37 పరుగుల తేడాతో గెలుపొందింది. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్టేలియా లక్ష్యచేధనలో తడబడింది.

ఓవల్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వన్డేలో సాధించిన విజయం జోరును టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.

19.3 ఓవర్లకు గాను 151 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో రెండు టీ20 మ్యాచ్‌ల టోర్నీలో 1-0 తేడాతో ముందుంది. కాగా, ఆస్ట్రేలియా ఓపెనర్లలో అత్యధికంగా ఆరోన్ ఫించ్ 44 పరుగులు చేయగా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 17 పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

Kohli poses for a picture with Man of the match award

అనంతరం బ్యాటింగ్‌కు స్మిత్ 21, లైన్ 17, వాట్సన్ 12, ఫల్కనర్ 10, రిచర్డసన్ 9, వాడే 5, బోయోస్ 3, హెడ్ 2 పరుగులకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీసుకోగా, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, పాండ్యా తలో రెండు వికెట్లు తీసుకోగా ఆశిష్ నెహ్రూ ఒక వికెట్ తీసుకున్నాడు.


తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్టేలియా

అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆస్టేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 149 పరుగుల వద్ద రిచర్డస్ రూపంలో తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షాన్ టైట్ 1, కామెరూన్ బోయాస్ 2 ఉన్నారు.

8వ వికెట్ కోల్పోయిన ఆస్టేలియా

జట్టు స్కోరు 143 పరుగుల వద్ద ఫల్కనర్ రూపంలో ఆస్టేలియా ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఆస్టేలియా 18 ఓవర్లకు 8 వికెట్లను కోల్పోయి 147 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిచర్డసన్ 7, కామెరూన్ బోయాస్ 2 పరుగులతో ఉన్నారు.

7వ వికెట్ కోల్పోయిన ఆస్టేలియా

ఆస్టేలియా వాడే రూపంలో ఏడో వికెట్‌ను కోల్పోయింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక పాండ్యా బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

1st T20I: Australia invite India to bat 1st; Hardik Pandya debuts, Yuvraj Singh back

6వ వికెట్ కోల్పోయిన ఆస్టేలియా
ఆస్టేలియా ఆరో వికెట్‌ను కోల్పోయింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో యువరాజ్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఐదో వికెట్ కోల్పోయిన ఆస్టేలియా

జట్టు స్కోరు 110 పరుగుల వద్ద వాట్సన్ రూపంలో ఆస్టేలియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ బౌలింగ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షేన్ వాట్సన్, ఆశిశ్ నెహ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో ఆస్టేలియా 14 ఓవర్లకు గాను ఐదు వికెట్లను కోల్పోయి 113 పరుగులు చేసింది.

4వ వికెట్ కోల్పోయిన ఆస్టేలియా

93 పరుగుల వద్ద ఆసీస్ నాల్గవ వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసీస్ బ్యాట్స్‌మెన్ హెడ్‌ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్టేలియా 11 ఓవర్లకు గాను 4 వికెట్లను కోల్పోయి 93 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఆసీస్ బ్యాట్స్‌మెన్లపై పట్టుబిగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో షేన్ వాట్సన్ 8, క్రిస్ లైన్ 4 పరుగులతో ఉన్నారు.

ఆరోన్ ఫించ్, స్మిత్ ఔట్

అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆసీస్ కెప్టన్ ఆరోన్ ఫించ్ ఔటయ్యాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఆస్టేలియా రెండో వికెట్‌ను కొల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 9.2 ఓవర్లకు గాను 3 వికెట్లను కోల్పోయి 89 పరుగులు చేసింది.

47 పరుగుల వద్ద తొలి వికెట్

ఆస్ట్రేలియా 40 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. దీంతో 7 ఓవర్లకు గాను ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు. టీమిండియా కెప్టెన్ ధోని వ్యూహం మార్చుతూ నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజాలను ప్రయోగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్ 30, స్టీవ్ స్మిత్ 12 పరుగులతో ఉన్నారు.

2 ఓవర్లకు 22 పరుగులు చేసిన ఆసీస్

2 ఓవర్లకు ఆస్టేలియా 22 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్ 20, డేవిడ్ వార్నర్ 0 పరుగులతో ఉన్నారు.

బ్యాటింగ్‌ను ప్రారంభించిన ఆస్టేలియా

భారత జట్టు నిర్ధేశించిన 189 పరుగుల విజయ లక్ష్యం ఛేదించిందేందుకు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ క్రీజులోకి వచ్చారు. కాగా, ఆసీస్ బ్యాట్స్ మన్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు టీమిండియా చివరి వన్డేలో రాణించిన పేసర్ బుమ్రా, తో పాటు ఆశిష్ నెహ్రాను బరిలోకి దించింది.


ఆస్టేలియా విజయ లక్ష్యం 189
అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లను నష్టపోయి 188 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయ లక్ష్యాన్ని 189 పరుగులుగా నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

రోహిత్ శర్మ (31) ధాటిగా ఆడే క్రమంలో షేన్ వాట్సన్ వేసిన బంతికి మిడాన్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం శిఖర్ ధావన్ 5 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (90), సురేష్ రైనా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ఆచి తూచి ఆడిన వీరిద్దరూ భారీ షాట్లతో స్కోరు బోర్డుని పరిగెత్తించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, సురేష్ రైనాను జేమ్స్ ఫల్కనర్ బోల్తా కొట్టించాడు. దీంతో 175 పరుగుల వద్ద మూడో వికెట్ గా సురేష్ రైనా (41) వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (11) వస్తూనే సిక్సర్‌ కొట్టాడు.

41 పరుగుల వద్ద సురేష్ రైనా

అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సురేష్ రైనా రూపంలో టీమిండియా మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా 19.2 ఓవర్లకు 3 వికెట్లను కోల్పోయి 175 పరుగులు చేసింది. సురేష్ రైనా 34 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో ధోని 6, విరాట్ కోహ్లీ 88 పరుగులతో ఉన్నారు.

అర్ధసెంచరీ చేసిన కోహ్లీ
అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీ సాధించాడు. 34 బంతుల్లో కోహ్లీ 51 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. మరోవైపు సురేష్ రైనా, విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 98 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 35, సురేష్ రైనా 22 పరుగులతో ఉన్నారు.

9వ ఓవర్‌లో ఆసక్తికర ఘటన
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ-20 9వ ఓవర్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఫల్కనర్ వేసిన 9వ ఓవర్ రెండవ బంతికి వికెట్లు పడ్డాయి. అయితే అది నోబాల్ కాదు. అయినప్పటికీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఎలాగంటే... ఆ బంతిని ఆడాల్సిన సురేష్ రైనా, ఫల్కనర్ పరుగు ప్రారంభించి, బంతిని చేతి నుంచి విడిచే చివరి క్షణంలో క్రీజును దాటి బయటకు వెళ్లిపోయాడు. దీంతో బంతి నేరుగా వచ్చి వికెట్లను తాకినా, అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం భారత స్కోరు 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు.

5 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ధావన్ ఔట్:
తొలి ట్వంటీ20లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 5 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా పేసర్‌ షేన్‌ వాట్సన్‌ విసిరిన ఓ స్లో డెలివరీ బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ధావన్‌ కీపర్‌ మాథ్యూ వెడ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లకు 2 వికెట్లను నష్టపోయి 58 పరుగులు చేసింది. క్రీజులో సురేష్ రైనా 7, విరాట్ కోహ్లీ 9 పరుగులతో ఉన్నారు.

40 పరుగుల వద్ద తొలి వికెట్:
భారత్‌ 40 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడి 20 బంతుల్లో 31 పరుగులు చేసి షేన్ వాట్సన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో 4.1 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 40 పరుగులు చేసింది.

అంతక ముందు రోహిత్ శర్మ తొలి ఓవర్‌లోనే ఫోర్‌, సిక్స్‌ బాది 10 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బౌలర్‌ టెయిట్‌ బౌలింగ్‌లో రెండో బంతినే బౌండరీకి తరలించిన రోహిత్‌.. నాలుగో బంతిని అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ట్వంటీ20 జట్టులోకి డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తిరిగి వచ్చాడు. ఐదు వన్డేల సిరిస్‌లో 1-4 తేడాతో ఓడిన టీమిండియా, ట్వంటీ20లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది.

1st T20I: Australia invite India to bat 1st; Hardik Pandya debuts, Yuvraj Singh back

అంతేకాదు 2011 మార్చిలో భారత్ తరఫున ఆడిన నెహ్రా ఇన్నాళ్లకు మళ్లీ తిరిగొచ్చాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన ఐదో భారత ఆటగాడు హార్దిక్ పాండే. వన్డేల్లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన బూమ్రాకు ఇది అంతర్జాతీయ తొలి ట్వంటీ 20.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (సారథి), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, క్రిస్ లిన్, జేమ్స్ ఫాల్కనర్, మాథ్యు వేడ్ (వికెట్ కీపర్), కామెరూన్ బోయ్సే, ట్రావిస్ హెడ్, కేన్ రిచర్డ్సన్, షాన్ టెయిట్, షేన్ వాట్సన్

భారత జట్టు: ధోనీ, (సారథి, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడెజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బూమ్రా, ఆశిష్ నెహ్రా

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X