న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజ్‌కోట్ టెస్టు, డే1: ఇంగ్లాండ్ 311/4, రూట్ సెంచరీ

By Nageshwara Rao

రాజ్‌కోట్: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. తొలి టెస్టు మొదటి రోజున ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్ 124, మెయిన్ అలీ 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్టు స్కోరుకార్డు

దీంతో తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. మొదటి రోజు తొలి సెషన్‌లో రాణించిన భారత బౌలర్లు తర్వాత తేలిపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 2, జడేజా 1, ఉమేష్ యాదవ్ 1 తలో వికెట్ తీసుకున్నారు.


218 పరుగుల వద్ద రూట్ (124) ఔట్

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 218 పరుగుల వద్ద బ్యాట్స్‌మెన్‌ జోయ్‌ రూట్‌‌ను 124 పరుగుల వద్ద ఉమేష్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపాడు. 180 బంతులు ఎదుర్కొన్న రూట్ 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో అదరగొట్టాడు. 102 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జోయ్‌రూట్‌, అలీ(88 నాటౌట్‌)తో కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 179 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 85.3 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.

రూట్ సెంచరీ, ఇంగ్లాండ్ 244/3 (73 ఓవర్లు)
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ రూట్ 165 బంతుల్లో 110 (9 ఫోర్లు, 1 సిక్సు)తో సెంచరీని నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో రూట్ కిది పదో సెంచరీ. కెరీర్‌లో 48వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రూట్ 53.48 యావరేజితో 4103 పరుగులు సాధించాడు.

England opt to bat first against India in Rajkot

ఇక, ఇంగ్లాండ్ 73 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో రూట్‌కు చక్కటి భాగస్వామ్యాన్ని అందిస్తూ అలీ 69 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి సెషన్‌లో రాణించిన భారత బౌలర్లు తర్వాత తేలిపోయారు. రెండో సెషన్‌లో భారత బౌలర్లు విఫలమవడంతో ఇంగ్లండ్‌ మరో వికెట్ కోల్పోకుండా 200 స్కోరు దాటింది. అంతక ముందు హమీద్ 31, కుక్ 21, డకెట్ 13 పరుగులు చేశారు. భారత స్పిన్నర్లు అశ్విర్ రెండు, జడేజా ఓ వికెట్ తీశారు.

టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 209/3
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీ విరామ సమయానికి 64 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 209 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ 93, అలీ 48 పరుగులతో ఉన్నారు. లంచ్ విరామానికి ముందు భారత బౌలర్లు కొంత మేరకు రాణించినప్పటికీ, జో రూట్ అద్భుతమైన ఆటతో మన బౌలర్లు తేలిపోయారు.

లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 102/3

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో బెన్ డెకెట్‌ను రహానే క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ 32.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ రెండు వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి శుభారభం అందించారు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ కుక్ జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

ఆ తర్వాత మరో ఓపెనర్ హమీద్‌ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 26.3 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. అంతక ముందు ఓపెనర్ హమీద్‌ ఇచ్చిన క్యాచ్‌ను భారత ఆటగాడు మురళీ విజయ్ వదిలేశాడు.

భారత్ చెత్త ఫీల్డింగ్: కుక్‌కు రెండు లైఫ్‌లు
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు కీలకమైన అవకాశాలను జారవిడిచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ టీమిండియా చెత్త ప్రదర్శన కారణంగా రెండు లైఫ్‌లు దక్కించుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో ఉన్న రహానే జారవిడవగా, రెండో ఓవర్‌లో రెండవ స్లిప్‌లో ఉన్న కోహ్లీ జారవిడిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఏడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు క్రికెట్‌లో చాలా రోజుల తర్వాత టీమిండియా టాస్ ఓటమి పాలైంది. కాగా, రాజ్ కోట్ స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.

టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేస్ బౌలర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమిలతో బరిలోకి దిగింది. ఇషాంత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు.

ప్రస్తుతం టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2008 తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు (2011, 12, 14) సిరీస్‌ల్లోనూ టీమిండియా ఓటమి పాలైంది. ఇందులో 2012లో స్వదేశంలోనూ టీమిండియా సిరీస్‌ కోల్పోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.

1st Test: England opt to bat first against India in Rajkot

2012లో సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ సీనియర్‌ స్పిన్‌ ద్వయం గ్రేమ్‌ స్వాన్‌, మాంటీ పనేసర్‌, వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో లేరు. తాజాగా, బంగ్లాదేశ్‌‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను సైతం ఇంగ్లాండ్ 1-1తో డ్రా చేసుకొని భారత్ పర్యటనకు వచ్చింది.

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ సేనతో ఇంగ్లాండ్ జట్టు సరితూగే పరిస్థితిలో లేదు. అయితే తాము అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగబోతున్నట్టు కెప్టెన్‌ కుక్‌, వందో టెస్టు ఆడబోతున్న స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పష్టం చేశారు. తొలి టెస్టులో ఇరు జట్లు స్పిన్‌నే నమ్ముకున్నాయి. అంతేకాదు ఈ టెస్టు సిరిస్‌లో తొలిసారి డీఆర్‌ఎస్‌ను ఉపయోగిస్తున్నారు.

జట్ల వివరాలు:

భారత్: విరాట్ కోహ్లీ, అశ్విన్, గంభీర్, జడేజా, మిశ్రా, మహ్మద్ షమీ, కేకే నాయర్, పాండ్యా, పుజారా, ఎఎం రహానే, సాహా, ఇషాంత్ శర్మ, మురళీ విజయ్, జె యాదవ్, యూటీ యాదవ్

ఇంగ్లాండ్: అలిస్టర్ కుక్, ఎంఎం అలీ, జెఎం ఆండర్సన్, అన్సారీ, జెఎం బెయిర్ స్టో, జేటీ బాల్, జిఎస్ బ్యాలెన్స్, జీజే బట్టే, బ్రాడ్, జేసీ బట్లర్, బిఎం డుక్కెట్, ఫిన్, హెచ్ హమీద్, రషీద్, రూట్ బీఏ స్టోక్స్, సీఆర్ వోక్స్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X