న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారీ షాట్‌లు ఆడాలనుకున్నా': ఆ అనాలోచిత షాట్ వల్లే భారత్ ఓటమి

By Nageshwara Rao

న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లో మైదానంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ నిర్లక్ష్యపు షాట్ భారత్‌కు ఓటమి తెచ్చిపెట్టింది. 243 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. టాప్ ఆర్డర్ విఫలమైనా, టెయిలెండర్లు జట్టు విజయం కోసం శక్తివంచన మేరకు పోరాడారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకానొకదశలో భారత్ 8 వికెట్లను నష్టపోయి 183 పరుగులు చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో న్యూజిలాండ్ పేసర్ల భరతం పట్టాడు. ఓటమి అంచుల్లోకి వెళ్లిందనుకున్న భారత్ జట్టును విజయానికి చేరువలోకి తీసుకొచ్చి అభిమానుల్లో ఆశలు రేకెత్తించాడు.

Photos : new zealand tour of india 2016

అయితే ఆఖర్లో చేసిన చిన్న తప్పిదం భారత్‌కు చేజేతులా పరాజయాన్ని తెచ్చిపెట్టింది. 8 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో ఉమేశ్, బుమ్రాలు భారీ షాట్లు కొట్టలేరని తెలిసినా... పాండ్యా కొట్టిన అనాలోచిత షాట్ సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని దూరం చేసిందని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

2nd ODI: We lost a wicket whenever I thought of hitting, says MSDhoni

ఈ అనాలోచిత షాట్ వల్ల భారత పర్యటనలో న్యూజిలాండ్‌ ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా గురువారం ఉత్కంఠగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో కివీస్‌ 6 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

2nd ODIలో చివరి వరకు ఉత్కంఠ: పోరాడి ఓడిన భారత్, కివీస్ విజయం2nd ODIలో చివరి వరకు ఉత్కంఠ: పోరాడి ఓడిన భారత్, కివీస్ విజయం

న్యూజిలాండ్‌ నిర్దేశించిన 243 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. కేదార్‌ జాదవ్‌ (37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) జట్టులో టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ ధోనీ (39), హార్దిక్‌ పాండ్యా (32 బంతుల్లో 3 ఫోర్లతో 36), అజింక్యా రహానె (28), ఉమేశ్‌ (18 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది.

2nd ODI: We lost a wicket whenever I thought of hitting, says MSDhoni

న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు, గప్టిల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని 'నేను భారీ షాట్లు ఆడదామని అనుకున్నప్పుడల్లా మా వికెట్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. రెండో ఎండ్‌లో కూడా మంచి సహాయం లభిస్తే భారీ భాగస్వామ్యాలు ఏర్పర్చడానికి సాధ్యమవుతుంది.' అని అన్నాడు.

అంతేకాదు 'పరుగులు చేయకుండా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందిగా మారింది. చివరి వరకు రన్‌రేట్ మా ఆధీనంలోనే ఉన్నా గెలవలేకపోయాం. ఎప్పుడైనా సరే లక్ష్య ఛేదనలో పూర్తి ఓవర్లు ఆడాలి. కానీ ఓ దశలో మేం దీన్ని అందుకుంటామన్న నమ్మకం లేకపోయింది. మంచు ఎక్కువగా ఉంది. దీనివల్ల బంతి బ్యాట్‌పైకి సరిగా రాలేదు.' అని వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X