న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోరాడి ఓడిన భారత్: ఆఖరి ఓవర్ టెన్షన్‌గా.., గ్రౌండులో బంతి తగిలి యువరాజ్ విలవిల

ఈడెన్ గార్డెన్‌లో ఇంగ్లాండుతో జరగుతున్న మూడో, చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్‌లో ఇంగ్లాండుతో జరిగిన మూడో.. చివరి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఇంగ్లాండ్ ఐదు పరుగులతో గెలిచింది. మ్యాచ్ చివర్లో ఉత్కంఠగా సాగింది. భారత్ గెలిచి ఉంటే విజయం క్రెడిట్ కేదార్ జాదవ్‌కు దక్కేది.

జాదవ్ 75 బంతుల్లో 90 పరుగులతో రెచ్చిపోయి ఆడాడు. జాదవ్ రెచ్చిపోయి ఆడటంతో పూర్తిగా ఆశలు వదులుకున్న భారత్ చివర్లో గెలుపు దిశగా సాగినట్లు కనిపించింది. కానీ పోరాడి ఓడింది.

అంతకుముందు, భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు వన్డేలలో భారత్ గెలిచింది. మూడో వన్డేలో గెలిచి క్లీన్ స్వీప్ కోసం భారత్ ప్రయత్నించి, విఫలమైంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ పరువు కాపాడుకుంది.

తొలుత ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది.

చివరి ఓవర్ ఇలా..

ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన స్థితిలో జాదవ్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో నాలుగు బంతుల్లో ఆరు పరుగులకు సమీకరణం చేరింది. రెండు బంతుల్ని జాదవ్ తిన్నాడు. 2 బంతుల్లో 6 పరుగులు చేయాలి. జాదవ్ బ్యాట్ మార్చాడు. ఐదో బంతికి సిక్సర్ కొట్టాలని చూశాడు. కానీ బౌండరీ లైన్ వద్ద బిల్లింగ్స్ క్యాచ్ అందుకున్నాడు. అప్పుడు భారత్ 9వ వికెట్ కోల్పోయింది. ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సిన స్థితిలో భువనేశ్వర్ పరుగులు చేయలేదు.

బంతి తగిలి విలవిలలాడిన యువరాజ్

మూడో వన్డేలో యువరాజ్ సింగ్ బంతి తగిలి విలవిల్లాడాడు. ఇంగ్లాండు బౌలర్ జేక్ బాల్ వేసిన పదో ఓవర్ మూడో బంతికి యువీ బ్యాట్ అడ్డు పెట్టాడు. కానీ అది బౌనస్ అయి నేరుగా కుడివైపున ఉన్న పక్కటెముకలకు తాకింది. యువీ వెంటనే బ్యాట్ కిందపడేసి ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. అంపైర్ ఏయిందని పలకరించగా.. కొంత సమయం తీసుకున్న యువీ మళ్లీ బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. యువీ ఇబ్బంది పడటం చూసిన అభిమానులు విచారం వ్యక్తం చేశారు.

india

భారత్ ఇన్నింగ్స్

- 316 పరుగుల వద్ద భారత్ జాదవ్ రూపంలో 9వ వికెట్ కోల్పోయింది.

- 291 పరుగుల వద్ద జడెజా అవుటయ్యాడు. 297 పరుగుల వద్ద అశ్విన్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

- భారత జట్టు స్కోర్ 277 పరుగుల వద్ద ఉన్నప్పుడు పాండ్యా అవుటయ్యాడు. 43 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

- 173 పరుగుల వద్ద ధోనీ అయిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 36 బంతుల్లో 25 పరుగులు చేశాడు.

- 133 పరుగుల వద్ద యువరాజ్ సింగ్ అవుటయ్యాడు. 57 బంతుల్లో 45 పరుగులు కొట్టిన యువీ.. ప్లంకెట్ బౌలింకులో బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.

- 102 పరుగుల వద్ద కోహ్లీ అవుటయ్యాడు. 63 బంతుల్లో 55 పరుగులు చేశాడు. స్టోక్స్ బౌలింగులో అవుటయ్యాడు.

- రెండు వికెట్లు పోవడంతో యువరాజ్ - కోహ్లీ నిలకడగా ఆడారు.

- జట్టు స్కోరు 37 వద్ద ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

- ఆదిలోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 13 వద్ద ఉన్నప్పుడు రహానే అవుటయ్యాడు. విల్లే బౌలింగులో అవుటయ్యాడు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్

ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. భారత్ ముందు 322 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- 319 పరుగుల వద్ద ఏడో వికెట్, 321 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ పడింది.

- 237 పరుగుల వద్ద బెయిర్ స్టో, 242 పరుగుల వద్ద అలీ అవుటయ్యారు. ఆరు వికెట్లకు 246 పరుగులతో ఉన్నారు.

- 212 పరుగుల వద్ద బట్లర్ పెవిలియన్ చేరాడు. 11 బంతుల్లో 15 పరుగులు చేసిన బట్లర్.. పాండ్యా బౌలింగులో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

- 194 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మోర్గాన్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగులో బూమ్రా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. 43 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

- ఇంగ్లాండ్ 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది.

- జట్టు స్కోరు 110 ఉన్నప్పుడు రాయ్ అవుటయ్యాడు. రాయ్ 56 బంతుల్లో 65 పరుగులు చేశాడు. జడెజా బౌలింగులో అవుటయ్యాడు.

- ఇంగ్లాండ్ టీం స్కోర్ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు బిల్లింగ్స్ అవుటయ్యాడు. బిల్లింగ్స్ 58 బంతుల్లో 35 పరుగులు చేశాడు. జడెజా బౌలింగులో బూమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X