న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోర్కెల్ దెబ్బకు విలవిల: ఓటమి పాలైన భారత్

By Nageswara Rao

రాజ్‌కోట్: దక్షిణాఫ్రికా తన ముందుంచిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడగా ఆడుతూ వచ్చిన భారత్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా మోర్కెల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో భారత్ ఓటమి తప్పలేదు. 193 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత 216 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ వికెట్లు కోల్పోకుండా ఆడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు.

నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో మూడో వన్డేను గెలుచుకుంది. సిరీస్‌లో 1-2 తేడాతో భారత్ వెనకబడి పోయింది. మోర్కెల్ కీలకమైన స్థితిలో 4 వికెట్లు తీసి భారత్ ఓటమిని శాసించాడు. డుమినీ, ఇమ్రాన్ చెరో వికెట్ తీశారు.

దక్షిణాఫ్రికా తన ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 113 పరగుుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ అర్థ సెంచరీ (65) చేసి డుమినీ బౌలింగులో అవుటయ్యాడు. శిఖర్ ధావన్ వికెట్లను కాపాడుకునే ప్రయత్నంలో చాలా మందకొడిగా (29 బంతుల్లో 13) ఆడి, పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అతను మోర్కెల్ బౌలింగులో వెనుదిరిగాడు.

భారత్ 216 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఓటమి దిశగా పయనించింది. రహనే నాలుగు పరుగులు మాత్రమే చేసి మోర్కెల్ బౌలింగులో అవుటయ్యాడు. అంతకు ముందు సురేష్ రైనా డకౌట్ అయ్యాడు. ధోనీ 47 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి మోర్కెల్ చేతిలో అవుటయ్యాడు.

రాజ్‌కోట్‌ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్‌‌ల మధ్య జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు సాధించింది. భారత్ విజయ లక్ష్యం 271 పరుగులు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డికాక్ 103, డుప్లెసిస్ 60, మిల్లర్ 33 పరుగులు చేయగా మిగిలిన వారెవరూ పెద్దగా రాణించలేదు. భారత్ బౌలర్లలో శర్మ 2, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

మ్యాచ్ సమ్మరీ:

దక్షిణాఫ్రికా ఆరో వికెట్‌ను కోల్పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జేపీ డుమినీ శర్మ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 47 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 6 వికెట్లను కోల్పోయి 243 పరుగులు సాధించింది. అంతక ముందు ఏబీ డివిలియర్స్ రూపంలో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.

3rd ODI: Unchanged South Africa bat in Rajkot; India pick Amit Mishra

జట్టు స్కోరు 210 పరుగుల వద్ద ఏబీ డివిలియర్స్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా 42 ఓవర్లకు గాను 5 వికెట్లను కోల్పోయి 217 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ సెంచరీ పూర్తి చేశాడు. మిల్లర్‌ (33), ఆమ్లా (5) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరినా డికాక్‌ భారత్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న డికాక్ మూడో వికెట్‌కి డుప్లెసిస్‌తో కలిసి సెంచరీ సాధించాడు.

118 బంతులాడిన డికాక్ 11X4, 1X6 సాయంతో 103 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మూడో వికెట్‌కి మంచి భాగస్వామ్యం లభించింది. డుప్లెసిస్‌ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శర్మ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 99 పరుగుల వద్ద హషీమ్ ఆమ్లా (5) పరుగుల వద్ద పెవిలియన్‌‌కు చేరాడు.

దీంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 21.3 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 72 పరుగుల వద్ద ఓపెనర్ మిల్లర్ (33) మిడాఫ్‌లో షాట్‌కు యత్నించి రహానే క్యాచ్‌గా అందుకోవడంతో మిల్లర్‌ పెవిలియన్‌ చేరాడు.

మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఓపెనర్లు డికాక్‌, మిల్లర్‌ ధాటిగా ఆడుతున్నారు. ఈ జోడి మరికొన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉంటే భారత్‌ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉన్నందున ధోనీ బౌలర్లను మారుస్తూ ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. దక్షిణాఫ్రికా మూడు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది.

భారత్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ దక్షిణాఫ్రికా జరుగుతున్న మూడో వన్డేలో తొలి ఓవర్‌ మెయిడిన్‌గా వేశాడు. దూకుడుగా ఆడే డికాక్‌ ఓవర్‌ మొత్తం ఆడినా భారత్‌ ఫీల్డర్లు మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయడంతో కనీసం సింగిల్‌ కూడా తీయలేకపోయాడు. భారత్‌తో మూడో వన్డేలో ఓపెనర్‌గా ఆమ్లాకి బదులు హిట్టర్‌ మిల్లర్‌ని పంపి దక్షిణాఫ్రికా ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజ్‌కోట్ వేదికగా సౌరాష్ట్ర క్రికెట్ సంఘం(ఎస్‌సీఏ) స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా 1-1తో సమానంగా ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌తో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్నాయి.

దక్షిణాఫ్రికా తుది జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. భారత జట్టులో మాత్రం ఫేసర్ ఉమేష్ యాదవ్ స్దానంలో లెగ్ స్ఫిన్నర్ అమిత్ మిశ్రాకు తుది జట్టులో చోటు దక్కింది. టీమిండియా ముగ్గురు స్ఫిన్నర్లతో హార్బజన్ సింగ్, అక్షర పటేల్, ఉమేష్ యాదవ్‌తో బరిలోకి దిగింది.

ఇక పటేల్ వర్గీయుల ఆందోళనల నేపథ్యంలో స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టుపక్కలా 144 సెక్షన్ విధించారు. 2,500 మంది పోలీసులు, 1000 మంది బౌన్సర్లు భద్రతలో ఉన్నారు. పటేళ్ల సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్చాలని కొంత కాలం నుంచి హార్దిక్ పటేల్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో పటేళ్ల నిరసనను, ఆందోళనలను తిప్పికొట్టేందుకు బీజేపీ కార్యకర్తలు సైతం రంగం సిద్ధం చేసుకున్నారు. రాజ్‌కోట్ మైదానం కెపాసిటీ 28 వేల మంది. అయితే 20 వేల టిక్కెట్లు బీజేపీ మద్దతుదారులే కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), సురేష్ రైనా, అక్షర పటేల్, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, మోహిత్ శర్మ.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), హషీమ్ ఆమ్లా, ఫాఫ్ డు ప్లెసిస్, జెపి డుమినీ, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, రబాడా మోర్న్ మోర్కెల్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X