న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుర్రాళ్లు ఇరగదీశారు: ధోనిసేన క్లీన్ స్వీప్, రాహుల్‌కే సిరిస్

By Nageshwara Rao

హరారే: జింబాబ్వేపై వన్డే సిరిస్‌ను ధోని సేన క్లీన్ స్వీప్ చేసింది. హరారే వేదికగా బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని సేన అద్భుతమైన ప్రదర్శనతో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

తొలి రెండు వన్డేల్లో భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడో వన్డేలో కూడా అదే విజయపరంపరను కొనసాగించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ధోని సేన కేవలం 21.5 ఓవర్లలోనే వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది.

కరుణ్ నాయర్ స్థానంలో చోటు దక్కించుకున్న ఫయాజ్ ఫజుల్ అరంగ్రేట్ర వన్డేలో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో రంగ ప్రవేశం చేసిన రాహుల్, ఫజల్ ఆరంభాన్ని ఘనంగా చాటుకున్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (63), ఫజల్ (55) అర్ధ సెంచరీలతో రాణించి జట్టును గెలిపించారు.

3rd ODI: Zimbabwe win toss, decide to bat first; Faiz Fazal debuts for India

కేఎల్ రాహుల్ 58 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా, ఫజల్ 58 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కును చేరుకున్నాడు. జింబాబ్వే బౌలర్లు ఎంత శ్రమించినా ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయారు. దీంతో మూడు వన్డేల సిరిస్‌లో జింబాబ్వే ఓటమి పరిసమాప్తమైంది. తొలి వన్డేలో సెంచరీ, మూడో వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

జింబాబ్వే ఇన్నింగ్స్:

భారత్, జింబాబ్వే జట్ల మధ్య హరారే వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే జట్టు 42.2 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత విజయ లక్ష్యాన్ని 124 పరుగులుగా నిర్దేశించింది.

మ్యాచ్ ప్రారంభం నుంచే జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌పై భారత బౌలర్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. జింబాబ్వే టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. భారత బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణించి నాలుగు వికెట్ల పడగొట్టాడు. జింబాబ్వే జట్టులో అత్యధికంగా సిబండా 38 పరుగులు చేశాడు.

3rd ODI: Zimbabwe win toss, decide to bat first; Faiz Fazal debuts for India

జింబాబ్వే వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుంది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో సిబందా అత్యధికంగా 38 పరుగులు చేయగా, ఆ తర్వాత చిబాబా (27) పరుగులతో రాణించారు. ఆరో ఓవర్లో భారత్ బౌలర్ ధావల్ కులకర్ణి.. ఓపెనర్ మసకద్జ (8)ను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు.

ఆ తర్వాత చిబాబా, సిబండా కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఆచితూచి పరుగులు రాబట్టారు. ఆ తర్వాత చహల్ వీరిద్దరినీ అవుట్ చేయడంతో జింబాబ్వే తేరుకోలేకపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మరుమ (17), వాల్లర్ (8), చిగుంబురా (0), ముతాంబానీ (4), కెప్టెన్ క్రీమర్ (0) పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

33వ ఓవర్లో చివరి రెండు బంతులకు భారత బౌలర్ బుమ్రా వరుసగా మరుమా, చిగుంబరలను అవుట్ చేశాడు. మరుమాను బౌల్డ్ చేయగా, చిగుంబర క్యాచ్‌ను వికెట్ల వెనుక ధోనీ అందుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వేసిన 34వ ఓవర్ తొలి బంతికి వాలర్ రనౌట్ అయ్యాడు. పటేల్ ఆ తర్వాతి బంతికి కెప్టెన్ క్రీమర్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు.

3rd ODI: Zimbabwe win toss, decide to bat first; Faiz Fazal debuts for India

దీంతో జింబాబ్వే వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4, చాహాల్ 2, కులకర్ణి, అక్షర పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. హరారే వేదికా భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్రీమర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో చిన్నపాటి మార్పు చోటు చేసుకుంది. కరణ్ నాయర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ పైజ్ ఫజల్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో జింబాబ్వే జట్టుపై ఫైజ్ ఫజల్ తన అంతర్జాతీయ వన్డే మ్యాచ్ అరంగేట్రం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి, రెండో వన్డేలో జింబాబ్వేపై టీమిండియా విజయం సాధించి 2-0తేడాతో సిరిస్‌ను సొంతం చేసుకుంది.

జట్ల వివరాలు:

ఇండియా: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, , అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్‌దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్

జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్‌మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X