న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3వ టెస్టు, డే1: భారత్‌దే పైచేయి, ఇంగ్లాండ్ 268/8

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలిలో మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

By Nageshwara Rao

మొహాలి: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలిలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్లను కోల్పోయి 268 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బాటీ 0, రషీద్ 4 పరుగులతో ఉన్నారు.

3rd Test: England bat firs

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు అలిస్టర్‌ కుక్‌ (27), హసీబ్‌ హమీద్‌ (9), జోరూట్‌ (15), మొయిన్‌ అలీ (16), బెన్‌స్టోక్స్‌ (29), జోస్‌ బట్లర్‌ (43) ఇలా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్న వికెట్ కీపర్ బెయిర్ స్టో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు.

జయంత్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా 89 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరడంతో బెయిర్ స్టో ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత ఆట ముగుస్తున్న చివరి రెండో ఓవర్‌లో ఉమేష్ యాదవ్ 8వ వికెట్ తీశాడు. 25 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద వోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

భారత బౌలర్లలో జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు తీసుకోగా షమీ, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.


మొదటి రోజు ఆట సాగిందిలా:

బెయిర్‌స్టో సెంచరీ మిస్: 89 పరుగుల వద్ద ఔట్

నిలకడగా రాణిస్తూ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసిన బెయిర్ స్టోను జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. తక్కువ పరుగులకే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అంతా పెవిలియన్ బాట పట్టినా... వికెట్ కీపర్ బెయిర్‌స్టో మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ దిశగా దూసుకెళుతున్నట్టు కనబడ్డాడు.

కుక్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో... మొయిన్ అలీ‌తో కలిసి 36 పరుగులు, స్టోక్స్‌తో కలిసి 57 పరుగులు, బట్లర్‌తో కలిసి 69 పరుగులు, వోక్స్‌తో కలిసి 45 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో జయంత్ యాదవ్ తన బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా 89 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్ స్టోను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు 258 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. దీంతో 177 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 6 ఫోర్లతో 89 పరుగులు చేశాడు.

సెంచరీకి చేరువలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టో
మొహాలిలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది. ముఖ్యంగా భారత బౌలర్లు విజృంభించారు. 83.2 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు అలిస్టర్‌ కుక్‌ (27), హసీబ్‌ హమీద్‌ (9), జోరూట్‌ (15), మొయిన్‌ అలీ (16), బెన్‌స్టోక్స్‌ (29), జోస్‌ బట్లర్‌ (43) ఇలా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్న వికెట్ కీపర్ బెయిర్ స్టో మాత్రం నిలదొక్కుకుని సెంచరీకి చేరువయ్యాడు. 83.2 ఓవర్ల ముగిసే సమయానికి 6 వికెట్లను కోల్పోయి 258 పరుగులు చేసింది. బెయిర్‌స్టో 81, క్రిస్ వోక్స్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమి, ఉమేశ్‌ యాదవ్‌, జయంత్‌ యాదవ్‌, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

England bat first, Karun Nair debuts as KL Rahul is ruled out

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

మొహాలి టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 68 ఓవర్‌లో రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతున్న జోస్ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. 40 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో జోస్ బట్లర్‌‌ పెవిలియన్ కు చేరాడు. దీంతో 78 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లను కోల్పోయిన 233 పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్‌స్టో 76, వోక్స్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Butler

65 ఓవర్లకు ఇంగ్లాండ్ 208/5
మొహాలి టెస్టులో ఇంగ్లాండ్ 144 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో 65 ఓవర్లకు గాను 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ 208 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. లంచ్ విరామానికి 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ స్టోక్స్‌, బెయిర్‌స్టో 50 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో స్టోక్స్ స్టంప్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో బెయిర్ స్టో 67, బట్లర్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Bairstow

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఇంగ్లాండ్ తడబడుతోంది. లంచ్ విరామ సమయానికి 29 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ ప్రారంభంలో దూకుడుగా ఆడింది. ఆ తర్వాత కుక్‌, హమీద్‌ జోరుకు ఉమేష్‌ యాదవ్‌ బ్రేక్‌ వేశాడు.

ఇంగ్లండ్ ఓపెనర్ హషిబ్ హమిద్(9)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపించగా, ఆ తర్వా జో రూట్(15)ను జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. వెంటనే కెప్టెన్ కుక్ (27)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఇక నాలుగో వికెట్‌గా మొయిన్ అలీ(16)ని షమీ పెవిలియన్‌కు పంపాడు.

మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. దీంతో 15 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలీ 0, బెయిర్ స్టో 1 పరుగులతో ఉన్నారు.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, అశ్విన్ తలో వికెట్ తీసుకున్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలిలో మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్టులో విజయం సాధించి, సిరిస్‌పై పట్టు సాధించాలని ఊవిళ్లూరుతోంది. ఇదిలా ఉంటే మొహాలి టెస్టులో కరుణ్ నాయర్‌ అరంగేట్రం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ స్ధానంలో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

కరుణ్ నాయర్‌కు ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టు క్యాప్‌ను అందజేశారు. నిజానికి గతేడాది జింబాబ్వే సిరీస్‌లోనే నాయర్‌కు జట్టులో చోటు దక్కాల్సి ఉన్నప్పటికీ స్టాండ్స్‌‌కే పరిమితమయ్యాడు. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడంపై సంతోషంగా ఉందని, భారత్ గెలుపు కోసం కృషి చేస్తానని నాయర్ పేర్కొన్నాడు.

మొహాలి పిచ్‌ ఫాస్ట్‌ బౌలర్లకు కాకుండా స్పిన్‌కు అనుకూలించేలా రూపొందించడం ఇంగ్లాండ్‌కు కాస్తంత ఇబ్బంది కలిగించే అంశమే. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో దిగింది. రెగ్యులర్ కీపర్ వికెట్ కీపర్ సాహా స్థానంలో పార్థీవ్ పటేల్ తుది జట్టులోకి రాగా, కేఎల్ రాహుల్ స్థానంలో కరణ్ నాయర్ జట్టులో చేరాడు.

చివరి నిమిషంలో కేఎల్ రాహుల్ గాయపడటంతో నాయర్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇంగ్లాండ్ జట్టులో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గత మ్యాచ్ రెండు మ్యాచ్‌ల్లో పేలవంగా ఆడిన బెన్ డకెట్ ను తప్పించి జాస్ బట్లర్‌కు అవకాశం కల్పించగా, గాయపడ్డ స్టువర్ట్ బ్రాడ్ స్థానంలో బాటీ జట్టులోకి వచ్చాడు.

జట్ల వివరాలు:

భారత్: మురళీ విజయ్, పార్థీవ్ పటేల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, కేకే నాయర్, అశ్విన్, రవీంద్ర జడేజా, యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ

ఇంగ్లండ్: అలెస్టర్ కుక్, హమీద్, రూట్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, బ్యాటీ, అండర్సన్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X