న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ తండ్రి అయిన ఏబీ డివిలియర్స్: బాబు పేరెంటో తెలుసా?

దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ దంపతులు శుక్రవారం తమ రెండో బిడ్డకు స్వాగతం పలికారు.

By Nageshwara Rao

హైదరాబాద్: దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ దంపతులు శుక్రవారం తమ రెండో బిడ్డకు స్వాగతం పలికారు. డివిలియర్స్ భార్య డేనియల్ జోహెన్స్ బర్గ్‌లోని ఓ స్ధానిక ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ మేరకు ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

బాబుకి జాన్ రిచర్డ్ డివిలియర్స్ అని పేరు పెట్టామని తెలిపాడు. 'మేము ఇప్పుడు నలుగురం. మా జీవితాల్లోకి కొత్త వెలుగుని నింపినందుకు దేవుడుని ప్రార్ధిస్తున్నాం. జాన్ రిచర్డ్ డివిలియర్స్ సోమవారం (17th జులై) 11 గంటలకు జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు' అని ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

AB de Villiers, wife welcome their second child; name him John Richard

2013లో ఏబీ డివిలియర్స్, డేనియల్‌లకు వివాహం జరిగింది. వీరికి ఇంతకముందే అబ్రహాం డివిలియర్స్ అనే రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. డివిలియర్స్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరిస్ ఆడిన అనంతరం డివిలియర్స్ స్వదేశానికి వెళ్లాడు. దక్షిణాఫ్రికా జట్టు మాత్రం ఇంగ్లాండ్‌లో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X