న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

56 టెస్టుల తర్వాత జట్టులోకి: మళ్లీ డకౌట్‌గానే వెనుదిరిగాడు

ఐదున్నరేళ్ల తర్వాత టీమిండియా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ బెంగుళూరులో టెస్టులో నిరాశపరిచాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐదున్నరేళ్ల తర్వాత టీమిండియా టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన తమిళనాడు ఓపెనర్ అభినవ్ ముకుంద్ బెంగుళూరులో టెస్టులో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియాతో బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్న అభినవ్ ముకుంద్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

<strong>బెంగుళూరు టెస్టు: అర్ధసెంచరీకి చేరువలో రాహుల్, లంచ్ బ్రేక్, భారత్ 72/2</strong>బెంగుళూరు టెస్టు: అర్ధసెంచరీకి చేరువలో రాహుల్, లంచ్ బ్రేక్, భారత్ 72/2

2011లో జూలైలో ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హమ్‌లో జరిగిన టెస్టులో అభినవ్ చివరిసారిగా భారత జట్టు తరుపున ఆడాడు. ఇన్నాళ్లకు మళ్లీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న అతని ఆట తీరులో మాత్రం మారలేదు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఆడిన 56 టెస్టు మ్యాచ్‌లను అభినవ్ మిస్సయ్యాడు.

ఇంగ్లాండ్‌తో చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో డకౌట్‌ అయిన అభినవ్ తాజాగా ఫిబ్రవరి 4 (శనివారం) నుంచి బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్టులో కూడా డకౌట్ గానే వెనుదిరిగాడు. ఈ టెస్టులో 8 బంతులను ఎదుర్కొన్న అభినవ్ మూడో ఓవర్‌లో స్టార్క్‌ వేసిన యార్కర్‌ లెంగ్త్‌ బంతిని అంచనా వేయలేక ఎల్బీగా వెనుదిరిగాడు.

Abhinav Mukund's comeback is shortlived as Mitchell Starc

ఇంగ్లాండ్‌తో ఆడిన టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో కూడా అభినవ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దాంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగ పరచుకోలేక పోయాడు. బెంగుళూరు టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో ‌కూడా అభినవ్ రాణించకపోతే ఇక భారత జట్టులో అతడి చోటు కలగానే మిగులుతుందేమో!

బెంగుళూరు టెస్టులో టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్‌ మురళీ విజయ్‌ గాయపడటంతో అతని స్థానంలో అభినవ్‌ ముకుంద్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు జయంత్‌ యాదవ్‌ను తప్పించి అతడి స్ధానంలో కరుణ్‌ నాయర్‌ను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X