న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెడ్ కోచ్‌గా కుంబ్లే: మరో పదవికి రవిశాస్త్రి రాజీనామా

ముంబై: టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ పదవి పైన బాగా ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ పదవి అనిల్ కుంబ్లేకు దక్కింది. దీంతో రవిశాస్త్రి ఆవేదనకు లోనైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఐసీసీ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయంశమవుతోంది. అయితే, కుంబ్లే ఎంపికకు, తాజా రవిశాస్త్రి రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌కు చెప్పారని అంటున్నారు.

కోచ్‌గా కుంబ్లే: లక్ష్మణ్‌పై తప్పుడు కథనాలు, బీసీసీఐ స్పందనకోచ్‌గా కుంబ్లే: లక్ష్మణ్‌పై తప్పుడు కథనాలు, బీసీసీఐ స్పందన

After losing Team India's coach job to Kumble, Ravi Shastri quits ICC committee

ఐసీసీలో కుంబ్లే చైర్మన్‌గా ఓ కమిటీ పని చేస్తోంది. సదరు కమిటీలో రవిశాస్త్రి కూడా సభ్యుడిగా ఉన్నారు. మీడియా ప్రతినిధి హోదాలో సదరు కమిటీలో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి.. ఆ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే టీమిండియా కోచ్‌గా ఎంపిక కావడంతో సదరు సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Also Read: కోచ్ ఎంపికలో ట్విస్ట్, కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్‌కు షేర్లు

కాగా, కోచ్ ఎంపిక కోసం సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలపై రవిశాస్త్రి ఘాటు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. గంగూలీని టార్గెట్ చేశాడు. ఈ వ్యాఖ్యలకు గంగూలీ కూడా కౌంటర్ ఇచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X