94 నుంచి 98.5 శాతానికి: అన్నీ సరైన నిర్ణయాలే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్‌ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్‌)ను ఉపయోగించడం వల్ల ఆటకు ఎంతో మేలు జరిగిందని ఐసీసీ అంటోంది. ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల అంపైరింగ్‌ నిర్ణయాల్లో కచ్చితత్వం పెరిగిందని ఐసీసీ పేర్కొంది.

After use of DRS umpires made 98.5% correct calls: ICC

డీఆర్‌ఎస్‌ వినియోగించడానికి ముందు అంపైరింగ్‌ నిర్ణయాల్లో 94 శాతం సరిగ్గా ఉండేవని, ఆ తర్వాత అంపైర్లు 98.5 శాతం వరకు సరైన నిర్ణయాలు వెలువరిస్తున్నారని ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్ వెల్లడించారు. 'డీఆర్‌ఎస్‌ వినియోగం తర్వాత అంపైరింగ్‌ ప్రమాణాలు పెరిగాయి. నిర్ణయాల్లో కచ్చితత్వం 94 నుంచి 95 శాతానికి చేరినందుకు గర్వంగా ఉంది' అని అన్నారు.

ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ను చేర్చేందుకు సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా ప్రయత్నం చేయాల్సి ఉందని రిచర్డ్‌సన్‌ పేర్కొన్నాడు. మరోవైపు డోపింగ్‌ ఫలితాలను మరింత పక్కాగా తేల్చేందుకు ఈ ఏడాది నుంచి రక్త పరీక్షలు కూడా ప్రవేశ పెడుతున్నామని రిచర్డ్‌సన్ వెల్లడించారు.

Read in English: DRS helped umpires: ICC
English summary
The International Cricket Council's (ICC) Chief Executive David Richardson has revealed that the Elite Panel of Umpires' usage of the Decision Review System (DRS) has enabled them to attain a staggering accuracy rate of 98.5 per cent.
Please Wait while comments are loading...