న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెత్త డ్రెస్సింగ్ రూమ్: 1996లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై అక్తర్

By Nageshwara Rao

కరాచీ: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 96 దశకాల్లో పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ ఓ ఫిక్సింగ్ రూమ్‌లా కనిపించేదని జియో న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అక్తర్ కుండబద్దలు కొట్టేసినట్లు చెప్పాడు.

''మా జట్టులో అత్యంత దారుణమైన డ్రెస్సింగ్‌ రూమ్ వాతావరణం ఉన్నది అప్పట్లోనే. క్రికెట్ కంటే ఫిక్సింగ్‌కు సంబంధించిన ముచ్చట్లే ఎక్కువగా వినిపించేవి. ఆ పరిస్థితుల్లో క్రికెట్‌ మీద దృష్టిసారించడం చాలా కష్టమయ్యేది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అధ్వానంగా ఉండేది'' అని అక్తర్‌ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇటీవల పాక్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌... స్టార్ ప్లేయర్ అఫ్రిది మీద ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో అక్తర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1996లో ఫిక్సర్లు మా జట్టును శాసించారని అక్తర్ ఈ సందర్భంగా తెలిపాడు.

తాను ఫిక్సింగ్‌కు ఎప్పుడూ దూరంగానే ఉన్నానని తెలిపాడు. జట్టు సహచరులకు కూడా సలహాలు ఇచ్చానని వెల్లడించాడు. సమగ్రత, విధేయతతో క్రికెట్ ఆడాలని ఇతరులకు కూడా హెచ్చరించినట్లు తెలిపాడు. 1999 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ క్రికెటర్లంతా స్థాయికి తగ్గట్లుగా ఆడి ఉంటే టైటిల్ గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించాడు.

Shoaib Akhtar speaks on match-fixing, Pakistan's 'very strangedressing room'

ఫిక్సింగ్‌కు దూరంగా ఉండాలని ఆమిర్‌కు తాను 2010లో సూచించానని, అదే ఏడాది అతను ఇంగ్లాండ్‌తో స్పాట్ ఫిక్సింగ్ చేసి దొరికిపోయాడని తెలిపాడు. దీంతో ఐసీసీ ఆమిర్‌‌ను ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పించింది.

''ఈ వివాదం ఇక్కడితో ముగిసినందుకు సంతోషం. అఫ్రిది అన్నట్లే వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్తే చాలా చెత్త విషయాలు జనాల్లోకి వెళ్లేవి. చాలా పేర్లు బయటికి వచ్చేవి'' అని అక్తర్‌ చెప్పాడు. అఫ్రిదిపై పాక్ మాజీ కెప్టెన్ మియాందాద్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడంతో మరోసారి క్రికెట్‌లో పాకిస్థాన్ పేరు తెరపైకి వచ్చింది.

'షాహిద్ అఫ్రిది ఓ దొంగ(Afridi is a son of a thief) కాసుల కోసం దేశాన్ని అమ్మేసిన దుర్మార్గుడు' అంటూ మియాందాద్ గత వారం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓసారి మ్యాచ్ ఫిక్సింగ్ డబ్బులు తీసుకుంటూ అఫ్రిది తనకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని వ్యాఖ్యానించాడు.

ఒకవేళ నేను చెప్పింది నిజం కాదంటే అఫ్రిది తన కూతురి మీది ఒట్టేసి చెప్పాలని అన్నారు. ఇదిలా ఉంటే మియాందాద్ వ్యాఖ్యలపై అఫ్రిదీ గట్టిగానే స్పందించారు. 'మియాందాద్ గొప్ప క్రికెటర్. ఆయన ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తాడని ఊహించలేదు. అందుకే ఎంత ఆట తెలిసినా మియాందాద్.. ఇమ్రాన్ ఖాన్‌లాగా మంచిపేరు సంపాదించుకోలేక పోయాడు' అని అఫ్రిదీ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X