న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రమాదంలో సచిన్ టెండుల్కర్ అరుదైన రికార్డ్!

By Srinivas

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డ్ ప్రమాదంలో పడింది! క్రికెట్ చరిత్రలో మాస్టర్ పేరిట ఎన్నో రికార్డులు నమోదయి ఉన్నాయి. అందులో కొన్ని దాదాపు ఎప్పటికీ దరి చేరలేనివి కూడా ఉన్నాయని చాలామంది అభిప్రాయపడుతుంటారు.

సచిన్ పేరిట ఉన్న లెక్కలేనన్ని రికార్డుల్లో... ఓ టెస్ట్ రికార్డు కూడా ఉంది. చారిత్రక ఈడెన్ గార్డెన్ మైదానంలో 11 ఏళ్ల క్రితం సచిన్ టెస్టుల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అప్పుడు సచిన్ వయస్సు 31 ఏళ్లు. సచిన్ రికార్డుల్లో ఇది కూడా అరుదైనది.

సచిన్‌లా 100 సెంచరీలు చాలా దూరం: కోహ్లీపై యువరాజ్సచిన్‌లా 100 సెంచరీలు చాలా దూరం: కోహ్లీపై యువరాజ్

Alastair Cook just shy of Sachin Tendulkar's record in Tests

అలాంటి రికార్డును ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ చేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే తక్కువ వయసులోనే టెస్టుల్లో 10 వేల పరుగుల రికార్డును అందుకునేందుకు కుక్‌ దూసుకొస్తున్నాడు. ప్రస్తుతం 31 ఏళ్ల కుక్‌ టెస్టుల్లో 9,964 పరుగులతో ఉన్నాడు.

ఇందులో 28 శతకాలు, 47 అర్ధ శతకాలు ఉన్నాయి. మే 19 నుంచి ఇంగ్లాండ్‌.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో కుక్‌ మరో 36 పరుగులు సాధిస్తే అప్పటి సచిన్‌ వయసు కంటే 5 నెలల తక్కువ వయసులోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 2005లో పాకిస్తాన్ పైన 31 ఏళ్ల వయస్సులో పదివేల పరుగులు చేశాడు. అప్పుడు సచిన్ వయస్సు కచ్చితంగా 31 ఏళ్ల పది నెలలు. ఇప్పుడు కుక్ వయస్సు అంతకంటే అయిదు నెలలు తక్కువగా ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X