న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20: వార్న్ చేతిలో చిత్తుగా ఓడిన సచిన్

By Nageswara Rao

హూస్టన్: అమెరికాలోని హూస్టన్‌లో సచిన్ బ్లాస్టర్స్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్‌పై వార్న్ వారియర్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 262 పరుగులు సాధించింది.

 Sachin's Blasters won the toss and elected fielding

భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సచిన్‌ బ్లాస్టర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో షేన్‌వార్న్‌ సారథ్యంలోని వార్న్‌ వారియర్స్‌ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్‌ లాస్‌ ఏంజెల్స్‌లో నవంబరు 14న జరగనుంది.

* సచిన్‌ బ్లాస్టర్స్‌ జట్టు 102 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. సైమండ్స్‌ బౌలింగ్‌లో లారా (19) క్రీజు వెలుపలికి వచ్చి షాట్‌ ఆడే ప్రయత్నంలో బౌల్డయ్యాడు. దీంతో 38 బంతుల్లో బ్లాస్టర్స్‌ విజయానికి 161 పరుగులు చేయాల్సి ఉంది.

* 88 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. సక్లెయిన్‌ బౌలింగ్‌లో జయవర్ధనె (5) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.

* 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లారా, జయవర్ధనె ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో బ్లాస్టర్స్‌ 175 పరుగులు చేయాల్సి ఉంది.

* 80 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ముస్తాక్ విసిరిన గూగ్లీని ఆడే ప్రయత్నంలో సచిన్‌ బౌల్డయ్యాడు. దీంతో బ్లాస్టర్స్‌ విజయానికి 70 బంతుల్లో 183 పరుగులు చేయాల్సి ఉంది.

* సచిన్‌ బ్లాస్టర్స్‌ జట్టు కెప్టెన్‌ సచిన్‌ వరుస బౌండరీలతో అభిమానుల్ని అలరిస్తున్నాడు.

* సచిన్‌ బ్లాస్టర్స్‌ జట్టు 43 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. కలిస్‌ బౌలింగ్‌ భారీ షాట్‌ కోసం ప్రయత్నించిన గంగూలీ (12) సంగక్కరకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

* 20 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 263 పరుగుల లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించిన సెహ్వాగ్‌ (16) ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన అగార్కర్‌ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని బౌల్డయ్యాడు.

* రెండో టీ20 మ్యాచ్‌లో 263 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా సచిన్‌ బ్లాస్టర్స్‌ జట్టు బ్యాటింగ్‌ ఆరంభించింది. ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. తొలి ఓవర్‌ వార్న్‌ వారియర్స్‌ బౌలర్‌ అక్తర్‌ వేశాడు.

అమెరికాలోని హూస్టన్‌లో సచిన్ బ్లాస్టర్స్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్న్ వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తొలి ఓవర్‌ నుంచే బౌండరీలతో వారియర్స్‌ జట్టు ఆటగాళ్లు చెలరేగి ఆడారు.

ఓపెనర్లు హెడెన్‌ (32), వాన్‌ (30) తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 51 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కలిస్‌ (45), పాంటింగ్‌ (41), సంగక్కర (70) వరుసగా చెలరేగి ఆడారు. చివర్లో సైమండ్స్‌ (19 నాటౌట్‌), జాంటీ రోడ్స్‌ (18 నాటౌట్‌) కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించడంతో వారియర్స్‌ 263 పరుగుల భారీ లక్ష్యాన్ని సచిన్‌ బ్లాస్టర్‌కు నిర్దేశించింది.

తొలుత టాస్ గెలిచిన సచిన్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆల్‌స్టార్ సిరిస్‌లో రెండో టీ20 అమెరికాలోని హూస్టన్‌లో గురువారం ప్రారంభమైంది. స్టేడియం మొత్తం క్రీడాభిమానులతో నిండిపోయింది. తమ దేశానికి సంబంధించిన ఆటగాళ్లు మైదానంలోకి రాగానే వారు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

సిటీ‌ఫీల్డ్ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కి దూరమైన మాజీ క్రికెటర్లు గంగూలీ, మెక్‌గ్రాత్ సచిన్ బ్లాస్టర్స్ తుజి జట్టులో చోటు దక్కించుకున్నారు. కాగా, తొలి టీ20లో విఫలమైన వీవీఎస్ లక్ష్మణ్‌ను కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. వార్న్ వారియర్స్ తుది జట్టులో అజిత్ అగార్కర్ చోటు దక్కించుకున్నాడు.

తొలి టీ20లో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్, కలిస్, సంగక్కర, పాంటింగ్, జాంటీ రోడ్స్ మెరుపులు మెరిపించగా షోయబ్ అఖ్తర్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ రాణించి సత్తాచాటారు. తొలి మ్యాచ్‌లో వార్న్ వారియర్స్‌తో ఓడిన సచిన్ బ్లాస్టర్స్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలని గట్టిపట్టుదలతో ఉంది.

సచిన్ బ్లాస్టర్స్:

జట్టు: వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, మహేల జయవర్ధనే, కార్ల్ హూపర్, మొయిన్ ఖాన్, ముత్తయ్య మురళీధరన్, గ్రేమ్ స్వాన్, షాన్ పొల్లాక్, కర్ట్లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్గ్రాత్, లాన్స్ క్లూసెనర్.

వార్న్ వారియర్స్:

జట్టు: మాథ్యూ హేడెన్, మైకేల్ వాన్, రికీ పాంటింగ్, జాంటీ రోడ్స్, జాక్వెస్ కలిస్, ఆండ్రూ సైమండ్స్, కుమార్ సంగక్కర, సక్లైన్ ముస్తాక్ డేనియల్ వెట్టోరి, షేన్ వార్న్, కోర్ట్నీ వాల్ష్, వసీం అక్రం, అలన్ డొనాల్డ్, అజిత్ అగార్కర్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X