న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World T20: క్రికెట్ అభిమానులకు ప్రత్యేకం

By Nageswara Rao

బెంగుళూరు: భారత్‌లో తొలిసారి జరగనున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌ మార్చి 8న నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టోర్నీలో ఓపెనింగ్ డే అయిన మంగళారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న టీమిండియా యువ ఆటగాళ్లతో వరల్డ్ టీ20 టోర్నమెంట్‌లోకి అడుగుపెడుతుంది. ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 గురించి పూర్తి సమాచారం వన్ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా...

All you need to know about ICC World T20 2016 in India

ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీ విశేషాలు:
* టోర్నీ మార్చి 8 (మంగళవారం) నుంచి ఏప్రిల్ 3 (ఆదివారం) వరకు జరగనుంది.
* టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.

గ్రూపు స్టేజీలో:
* గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఓమన్ జట్లు ఉన్నాయి
* గ్రూప్ బీలో జింబాబ్వే, స్కాట్ లాండ్, హాంగ్ కాంగ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.
* తొలి రౌండ్‌లో భాగంగా గ్రూప్ విన్నర్స్ సెకండ్ రౌండ్‌లో ఆడతారు
* సెకండ్ రౌండ్‌ (సూపర్ 10)లో ప్రతి గ్రూపులో రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి
* గ్రూప్ 1లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. (గ్రూప్ బీలో గెలిచిన జట్టు గ్రూప్ 1తో జత కలుస్తుంది)
* గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. (గ్రూప్ ఏలో గెలిచిన జట్టు గ్రూప్ 2తో జత కలుస్తుంది)

ఓపెనింగ్ మ్యాచ్:
* టోర్నీలో భాగంగా ఓపెనింగ్ మ్యాచ్‌‌లు నాగ్‌పూర్‌లో జరగనున్నాయి.
* జింబాబ్వే Vs హాంకాంగ్ - మ్యాచ్ మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభమవుతుంది.

టోర్నీ ఫార్మెట్:
* టోర్మీ ఫార్మెట్ మూడు భాగాలుగా జరుగనుంది. ఒకటి ఫస్ట్ స్టేజీ (క్వాలిఫయిర్స్), సూపర్ 10, నాకౌట్ (సెమీ పైనల్స్, పైనల్)
* మొదటి 8 జట్లు కూడా రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ విన్నర్స్ గెలిచిన రెండు జట్లు కూడా సూపర్ 10లో ఉన్న మిగతా 8 జట్లతో జత చేరతాయి.
* సూపర్ 10లో ఉన్న పది జట్లలో 4 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

ఏ ఛానల్‌లో ఈ టోర్నీని చూడొచ్చు:
* అన్ని మ్యాచ్‌లను కూడా స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.

టికెట్లను ఎక్కడ కొనుగోలు చేయాలి:
* టిక్కెట్లను ఐసీసీకి చెందిన ఆన్‌లైన్ వెబ్ సైట్ www.icc-cricket.com ద్వారా కొనుగోలు చేయాలి
* మ్యాచ్‌లు జరిగే స్టేడియాల వద్ద కూడా టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు.
* భారత్ జట్టు ఆడే మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్స్, పైనల్ మ్యాచ్‌కు లాటర్ సిస్టమ్ ఉంది.
* ఫిబ్రవరి 24 నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ మొదలవుతుంది.

టిక్కెట్ ధరలు ఎలా ఉన్నాయి:
* స్టేడియాలు అవి ఉన్న ప్రాంతాలను బట్టి టిక్కెట్ ధరలను నిర్ణయించారు.
* నాగ్‌పూర్, ధర్మశాల, న్యూఢిల్లీ, కోల్‌కత్తా, మొహాలీ వేదికల్లో కనీస ధర రూ. 100గా నిర్ణయించారు.
* బెంగుళూరులో కనీస ధరను రూ. 250గా నిర్ణయించారు.
* ముంబైలో కనీస ధరను రూ. 500గా నిర్ణయించారు.
* నాగ్‌పూర్ (Starts at 100) (Ranges upto 12500)
* ధర్మశాల రూ. 100 నుండి 15,000
* బెంగుళూరు రూ. 250 నుండి 8,000
* ముంబై రూ. 500 నుండి 35,000
* న్యూఢిల్లీ రూ. 100 నుండి 10,000
* కోల్‌కత్తా రూ.100 నుండి 1,500
* చెన్నై రూ.50 నుండి 1,000
* మొహాలీ రూ. 100 నుండి 18,750

మ్యాచ్ టైమింగ్స్:
* టోర్నీలో తొలి మ్యాచ్ మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభవుతుండగా, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.
* సెమీ ఫైనల్స్, పైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.

తొలిసారిగా వరల్డ్ టీ20లో ఆడుతున్న జట్టు
* ఓమన్

గత ఛాంపియన్లు:
* 2007 - India
* 2009 - Pakistan
* 2010 - England
* 2012 - West Indies
* 2014 - Sri Lanka

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X