న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్‌గా ద్రావిడ్‌ను ఎందుకు పక్కన పెట్టారంటే...

By Pratap

ముంబై: టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ చివరలో కథ అడ్డం తిరిగి అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. విదేశీ క్రికెట్ ప్రముఖులు కూడా ద్రావిడ్‌ కోచ్‌గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ద్రావిడ్‌ను ఎంపిక చేయకపోవడానికి తగిన కారణమే ఉందని అంటున్నారు.

అయితే ద్రవిడ్‌ను కాదని కుంబ్లేను హెడ్ కోచ్‌గా నిర్ణయిండానికి కారణం ద్రవిడ్‌నే. తాను కుంటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్నందువల్లే కోచ్ పదవిని వదులుకున్నాడని చెబుతున్నారు. స్వయాన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ద్రావిడ్‌ను ఈ విషయం అడగగా తాను జూనియర్ టీంకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తానని సమాధానమిచ్చాడని ఠాకూర్ ఓ జాతీయ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

Anil Kumble got India coaching job after Rahul Dravid turned it down

అయితే కోచ్ ఎంపికలో కీలక పాత్ర పోషించిన సలహా కమిటీలో సచిన్, గంగూలి, లక్షణ్‌లతో పాటుగా ద్రావిడ్ లేకపోవడం విచారకరమే. ద్రవిడ్‌నే కోచ్‌గా నిర్ణయించాలని తాము భావించామని అయితే అందుకు ద్రవిడ్ నిరాకరించడంతో కుదరలేదని ఠాకూర్ చెప్పారు.

ఉన్నవాళ్లలో ది బెస్ట్ కుంబ్లేను ఎంపిక చేసినట్టు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. టీమిండియా కోచ్ వదవికి 57 దరఖాస్తులు రాగా, 21 దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేశారు. చివరకు కుంబ్లేను ఎంపిక చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X