న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

9000: ధోని ఖాతాలో మరో రికార్డు, 5వ ఆటగాడిగా గుర్తింపు

By Nageshwara Rao

హైదరాబాద్: మొహాలి వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ధోని 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

మూడో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సట్నర్ వేసిన 17వ ఓవర్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచి ధోని ఈ ఘనతను సాధించాడు. దీంతో 9వేల పరుగులను చేరుకున్న 5వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కి ముందు ధోని 9వేల పరుగులు మైలురాయిని చేరుకోవడానికి 22 పరుగులు చేయాల్సి ఉంది.

Another milestone: MS Dhoni completes 9,000 ODI runs

మొహాలిలో జరుగుతున్న వన్డేలో ధోనీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 35 ఏళ్ల ధోని భారత్ తరుపున 280 వన్డేలాడి 8,978 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

డిసెంబర్ 23, 2014న బంగ్లాదేశ్‌లోని చిట్టగ్యాంగ్‌లో ధోని అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఒక బంతిని ఎదుర్కొన్న ధోని రనౌట్ కావడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆడిన రెండు వన్డేల్లో కూడా 12,7 పరుగులు మాత్రమే చేశాడు.

అయితే విశాఖపట్నంలో పాకిస్థాన్‌పై జరిగిన వన్డే మ్యాచ్‌లో 148 పరుగులు చేసి అంతర్జాతీయ క్రీడాకారుల దృష్టిని ఆకర్షించాడు. ఆనాటి ఈనాటి వరకు ధోని కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా బ్యాట్స్ మెన్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు.

మూడో వన్డేలో ధోని 9000 పరుగుల మైలురాయిని అందుకుని ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఎలైట్ గ్రూపులో ధోని చేరాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, అజారుద్దీన్ తర్వాత 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

మొత్తంగా చూస్తే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న 17వ బ్యాట్స్ ‌మెన్. భారత్ తరుపున 90 టెస్టులాడిన ధోని 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్ నుంచి 2014లో ధోని వైదొలగాడు. దీంతో పాటు తన క్రికెట్ కెరీర్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు(2007లో వరల్డ్ టీ20, 2011లో వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ) అందుకున్న కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు.

భారత బ్యాట్స్‌మెన్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు: టాప్ 5 (అక్టోబర్ 23, 2016 నాటికి)

1. Sachin Tendulkar - 18,426 runs (463 matches)
2. Sourav Ganguly - 11,363 (311)
3. Rahul Dravid - 10,889 (344)
4. Mohammad Azharuddin - 9,378 (334)
5. MS Dhoni - 9002 (281)

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X