న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిజానిజాలివిగో: యువరాజ్ తల్లి షబ్నంపై ఆరోపణలకు

By Nageshwara Rao

న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ప్రసారమైన బిగ్‌బాస్‌ టీవీషోలో ఆకాంక్ష శర్మ (25) అనే యువతి యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్‌‌పై చేసిన ఆరోపణలు అవాస్తవమని షబ్నం తరుపు న్యాయవాది దమన్వీర్ సింగ్ సోబ్టీ స్పష్టం చేశారు. షబ్నం కారణంగానే ఆకాంక్ష తన భర్త నుంచి విడిపోయినట్టు ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఈ ఆరోపణలకు సంబంధించి శనివారం ఆయన మీడియాలో అన్ని ఆధారలతో సాహా సమాధానం ఇచ్చారు. క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తమ్ముడు జోరావర్‌ సింగ్‌‌ను వివాహం చేసుకున్న ఆకాంక్ష, తన పెళ్లి విచ్ఛిన్నం కావడానికి షబ్నం కారణమంటూ బిగ్‌బాస్‌ టీవీషోలో ఆరోపించింది. దాని నుంచి కోలుకునేందుకు ఈ షోకు వచ్చానని ఆమె తెలిపింది.

Are Akanksha Sharma's allegations against Yuvi's mom made up?

తన అత్తగారి కుటుంబం నుంచి తాను ఏదీ కోరుకోవడం లేదని, తనకు విడాకులు ఇస్తే చాలని ఆమె వ్యాఖ్యానించింది. దీంతోపాటు భర్తతో విడిపోయాక అతని కుటుంబం తనకు నెలకు రూ. 3వేల మాత్రమే ఇచ్చేవారని, తాను చాలా ఇబ్బంది పడ్డానన్న ఆకాంక్ష ఆరోపించింది.

ఈ ఆరోపణలపై న్యాయవాది మాట్లాడుతూ 2014 సెప్టెంబర్లో ఆకాంక్ష ఇంటి నుంచి వెళ్లిపోయాక షబ్నం ప్రతినెలా ఆమెకు రూ. 20 వేలు పంపేవారని అలా ఏప్రిల్, 2015 వరకు డబ్బు పంపారని పేర్కొన్నారు. అయితే అదనంగా డబ్బులు ఇవ్వాలని ఆకాంక్ష బెదిరించడంతో జొరావర్ కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేశాడని చెప్పారు.

సల్మాన్ షోలో యువరాజ్ తల్లిపై రెండో కోడలు తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం ఈ కేసు చండీగఢ్ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇక తాము హనీమూన్‌కు వెళ్లినప్పుడు షబ్నం తమ వెంట వచ్చారని, ఆమె తమ గదిలో నిద్రించిందని ఆకాంక్ష చేసిన ఆరోపణలకు కూడా ఆయన బదులిచ్చారు.

పెళ్లయ్యాక ఆకాంక్ష అనారోగ్యంతో ఉందని, ఈ విషయం ఆమె తల్లి మోనికకు చెప్పడంతో తన కుమార్తెకు సమస్య ఉందని అంగీకరించిందని, ఆకాంక్ష ఒంటరిగా వెళ్లరాదన్న మోనిక అభ్యర్థన మేరకు షబ్నం అన్ని ఖర్చులు భరించి వారిద్దరితో పాటు షబ్నం, మోనిక ఇద్దరూ గోవాకు వెళ్లారని చెప్పారు.

Are Akanksha Sharma's allegations against Yuvi's mom made up?

వీటికి సంబంధించి నగదు బదిలీ చేసిన బిల్లులు, ఫ్లయిట్ టికెట్లు, హోటల్ బిల్లులు అన్నీ ఆయన మీడియాకు చూపించడం విశేషం. గర్భం ధరించాలని ఆకాంక్షను షబ్నం ఒత్తిడి చేసిందన్న ఆరోపణలపై కూడా ఆయన సమాధానమిచ్చారు. ఇవ్వన్నీ కూడా ఆకాంక్ష చేసిన తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X