న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీలు,భారత్ ఆటగాళ్ల స్వార్థంపై ధోనీ ఏమన్నాడు?

By Srinivas

మెల్బోర్న్: భారత ఆటగాళ్లు సెల్పిషా (స్వార్థపరులు) అనే ప్రశ్నకు భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 'కాద'ని సమాధానం ఇచ్చారు. ఆదివారం మెల్బోర్న్‌లో జరిగిన మూడో వన్డేలో భారత్.. ఆసిస్ చేతిలో ఓడింది. తద్వారా సిరీస్ కూడా కోల్పోయింది.

అనంతరం ధోనీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల నుంచి ధోనీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. భారత బ్యాట్సుమెన్ సెంచరీల కోసం సెల్ఫిష్‌గా వ్యవహరిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించారు.

దానికి ధోనీ క్లుప్తంగా.. 'లేదు. ఖచ్చితంగా అలా కాదు. నేను అయితే అలా అనుకోవడం లేదు. మళ్లీ మళ్లీ అడగకండి. స్టాటిస్టిక్స్ (గణాంకాలు) మీ వద్దే ఉన్నాయి. కాబట్టి మళ్లీ మళ్లీ అడగొద్దు' అని ధోనీ చెప్పాడు.

Are Indian batsmen selfish? 'Certainly not, don't ask me to elaborate', says MS Dhoni

అంతకుముందు ఆసిస్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. భారత బ్యాట్స్‌మెన్‌ మైలురాళ్ల కోసం ఆడుతున్నట్లున్నారని, సెంచరీలు చేసి అందరి దృష్టిలో పడొచ్చు.. కానీ తనకు జట్టు గెలవడమే ముఖ్యమని గ్లెన్ మాక్స్‌వెల్ అన్నాడు.

వన్డేల్లో సెంచరీల కోసం ఆసిస్ ఆటగాళ్లు పాకులాడరని, అవి బ్యాట్స్‌మెన్‌ గణాంకాలను మాత్రమే మెరుగుపరుస్తాయన్నాడు. ఓ ఆటగాడు సెంచరీ సాధించాలని జాగ్రత్తగా ఆడుతూ పోతే జట్టుకు 40 నుంచి 50 పరుగులు నష్టం జరగొచ్చునని, అది ఫలితం మీద ప్రభావం చూపిస్తుందని, భారత్‌కు అదే సమస్య అని మాక్స్‌వెల్ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X