న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అట్లెటికో డీ కోల్‌కతా గెలుపు

అట్లెటికో డీ కోల్‌కతా అటాకింగ్ ప్లేయర్ ఇయాన్ హుమ్ చెలరేగిపోయి రెండు గోల్స్ చేయడంతో ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుపై తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో 3 - 2 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

కోల్‌కతా: అట్లెటికో డీ కోల్‌కతా అటాకింగ్ ప్లేయర్ ఇయాన్ హుమ్ చెలరేగిపోయి రెండు గోల్స్ చేయడంతో ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుపై తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో 3 - 2 స్కోర్ తేడాతో విజయం సాధించింది. రెండు జట్లు ఫైనల్స్‌లో ప్రవేశించేందుకు హోరాహోరీ పోరాడడంతో వరుస గోల్స్, సంబురాలు, ఆంక్షల కార్డు, డ్రామా, సస్పెన్స్, అభిమానుల కేరింతలతో కోల్ కతాలోని రవీంద్ర సారోబార్ స్టేడియం హోరెత్తిపోయింది.

మళ్లీ రెండు జట్ల మధ్య చివరి సైమీ ఫైనల్స్ మ్యాచ్ మంగళవారం ముంబైలో జరుగనున్నది. మూడో నిమిషంలోనే స్ఫూర్తిదాయక మిడ్ ఫీల్డర్, మిజోరం కుర్రాడు లాల్రిండికా రాల్టే దూరం నుంచి పంపిన బంతిని గోల్‌పోస్ట్‌కు పంపి కోల్‌కతా జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. కోల్ కతా జట్టులో భారతీయ ప్లేయర్లలో రాల్టే మాత్రమే ఈ ఏడాది గోల్ సాధించిన రికార్డు నెలకొల్పాడు.

కాగా, మ్యాచ్ వీక్షించేందుకు హాజరైన సుమారు 12,500 మంది అభిమానులకు రెండు జట్లు వరుస గోల్స్‌తో కన్నుల పండువచేశాయి. తొమ్మిది నిమిషాల గడువులోగానే మూడు గోల్స్ నమోదు కావడంతో అభిమానులు సంబురాల్లో మునిగి తేలారు.

ముంబై సారధి డియాగో ఫోర్లాన్ పంపిన ఫ్రీ కిక్ బంతులను అందుకున్న లియో కోస్టా పదవ నిమిషంలోనూ, గెర్సన్ వైరా 19వ నిమిషంలోనూ గోల్ పోస్ట్ బాట పట్టించి కోల్ కతాపై 2 - 1 స్కోర్ లీడ్ ఆధిక్యం సాధించారు. కానీ అట్లెటికో డీ కోల్‌కతా అటాకర్ ఇయాన్ హుమ్ వీరి వ్యూహం, ప్రణాళికలను అడ్డుకున్నాడు.

వరుసగా 39, 45 ప్లస్ 2వ నిమిషంలో రెండు గోల్స్ చేసి జట్టుకు 3 - 2 లీడ్ తెచ్చి పెట్టారు. చివరిగా ఫైనల్స్ మ్యాచ్‌లో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోబోమని తేల్చి చెప్పాడు. 74వ నిమిషంలో పంతానికి పోయినందుకు ముంబై సారధి డియాగో ఫోర్లాన్ రెడ్ కార్డును ఎదుర్కొని జట్టుకు దూరం కావాల్సి వచ్చింది.

ATK rally past Mumbai City 3-2 in first leg of ISL semis

గోల్ కోసం ముందుకు సాగుతున్న ఫోర్లాన్.. అట్లెటికో డీ కోల్ కతా ప్లేయర్ జువెల్ రాణాను కాలు అడ్డం పెట్టి పడగొట్టడంతో ఫౌల్ చేసినట్లయింది. ఆ వెంటనే రిఫరీ డిలాన్ పెరీరా రెడ్ కార్డు చూపడంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. తత్ఫలితంగా మిగతా సమయంలో ముంబై 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది.

51వ నిమిషంలో తొలి సారి ఎల్లోకార్డును ఎదుర్కొన్న ఫోర్లాన్.. రెండోసారి రాణాను అడ్డుకోవడంతో రెడ్ కార్డును ఎదుర్కోవాల్సి రావడంతో మంగళవారం ముంబైలో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ప్రస్తుత సీజన్‌లో సొంతగడ్డపై కోల్ కతా జట్టుకు ఇది రెండో విజయం.

అంతే కాదు 2014 తర్వాత రెండోసారి ఫైనల్స్ లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినట్లయింది. ఈ దఫా లీగ్ దశలో సొంతగడ్డపై నష్టంలేకుండా ఒక మ్యాచ్ లో విజయం సాధించిన పొస్టిగ సేన, ఐదింటిని డ్రా గా ముగించింది. మరొక మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

ఫోర్లాన్‌ను బెంచ్ కు పంపిన తర్వాత నాలుగు నిమిషాలకు కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ బంతిని గోల్ పోస్టు బాట పట్టించినా రిఫరీ దానికి ఆఫ్ సైడ్ ఫ్లాగ్ ఊపడంతో శ్రమ వ్రుథా అయ్యింది. మ్యాచ్ ఫుట్ టైం ముగిసిన తర్వాత 90 ప్లస్ నాలుగో నిమిషంలో ఇయాన్ హుమ్ పంపిన బంతి గోల్ పోస్టు దరికి చేరకపోవడంతో హ్యాట్రిక్ గోల్స్ చేసిన రికార్డు మిస్సయ్యాడు.

కోల్ కతా ప్లేయర్లు మూడో నిమిషం నుంచే పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. మూడో నిమిషంలో లాల్రిండికా రాల్టే గోల్ చేసిన ఏడు నిమిసాలకు లియో కోస్టా గుడ్ లో‌డ్రైవ్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌కు తరలించాడు. కానీ గోల్ కీపర్ అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో స్కోర్ సమమైంది.

మరో 30 సెకన్లకు పోస్టిగకు అందజేసిన సులువైన బంతిని రాల్టే గోల్ పోస్ట్ దారి పట్టించినా లైన్‌మెన్ అది ఆఫ్ సైడ్ అని తేల్చేశాడు. ఎటికె సారధి పొస్టిగ తెలివిగా చేసిన ఫ్లిక్ ను రాల్టే హెడ్డర్ ద్వారా గోల్ పోస్ట్‌కు చేర్చాడు. ముంబై గోల్ కీపర్ అమరీందర్ తడబడటంతో బంతి నేరుగా గోల్ పోస్టులో చేరిపోయింది. ఆ తర్వాత ముంబై సారధి డియాగో ఫోర్లాన్ 10 నుంచి 19వ నిమిషం వరకు రెండు ఫ్రీ కిక్‌ల ద్వారా రెండు గోల్ పాయింట్లతో జట్టుకు 2 - 1 లీడ్ ఆధిక్యం సాధించిపెట్టాడు.

ఎటికె డిఫెన్స్‌ను భారత జట్టు సారధి సునీల్ ఛెత్రి సాయంతో ముంబై కెప్టెన్ డియాగో ఫోర్లాన్ దిగ్విజయంగా అడ్డుకున్నాడు. ఛెత్రి పంపిన బంతిని ఫోర్లాన్ ఇన్‌సైడ్ బాక్స్‌లోకి ఫ్లిక్ చేయడంతో లియో కోస్టా బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించి స్కోర్ సమంచేశాడు.

19వ నిమిషంలో రెండోసారి ఫోర్లాన్ పంపిన బంతిని వెరీరా అతి దగ్గర నుంచి గోల్ పోస్ట్‌కు చేర్చడంతో ముంబై లీడ్ సాధించింది. ఈ దశలో 23వ నిమిషంలో లాల్రిందికా రాల్టే, లాహ్సాంగ రాల్టే 31వ నిమిషంలో రిఫరీ ఎల్లోకార్డు ప్రదర్శించడంతో కొద్దిసేపు ఇరు పక్షాలు వాగ్వాదానికి దిగాయి.

సమీగ్ దౌటీ సాయంతో ఇయాన్ హుమ్ రెండో గోల్ చేయడంతో ముంబై సిటీ ఆత్మరక్షణలో పడింది. 74వ నిమిషంలో అనవసర పంతానికి పోయిన ఫోర్లాన్.. ఎటికె ప్లేయర్ జువెల్ రాణాను అడ్డుకుని రెడ్ కార్డుతో వైదొలగడంతో ముంబై కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది. కేవలం 10 మంది ప్లేయర్లతో ఆధిక్యం సాధించేందుకు ముంబై చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X