న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు అనుకూలం: కష్టాలు తప్పవంటున్న పాంటింగ్

ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానున్న తమ జట్టుకు కష్టాలు తప్పవని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిబ్రవరిలో భారత పర్యటనకు రానున్న తమ జట్టుకు కష్టాలు తప్పవని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. భారత్ వారికి తగ్గట్టుగా పిచ్‌ను రూపొందించుకోవడమే ఇందుకు కారణమని పాంటింగ్ జోస్యం చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ మధ్య కాలంలో భారత్‌లో పర్యటించిన పలు విదేశీ జట్లకు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాయో అదేవిదంగా ఆస్ట్రేలియా జట్టు కూడా అక్కడ కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నాడు. భారత్‌లో పరిస్థితుల్ని అర్థం చేసుకుని అక్కడ విజయం సాధించడమంటే అంత సులభం కాదనని పాంటింగ్ చెప్పాడు.

ఆస్ట్రేలియా నెగ్గుకు రావడం కష్టమే

ఆస్ట్రేలియా నెగ్గుకు రావడం కష్టమే

'భారత పర్యటనలో ఆస్ట్రేలియా నెగ్గుకు రావడం కష్టమే. భారత పర్యటనకు వెళ్లే ఏ జట్టుకైనా కష్టాలు తప్పవు. ఈ మధ్య కాలంలో ఇదే మనకు కనబడుతోంది. అదే పరిస్థితి మాకు కూడా ఎదురవుతుంది. గత కొంతకాలంగా అక్కడ వికెట్లు భారత జట్టుకు చాలా అనుకూలంగా ఉంటున్నాయి' అని పాంటింగ్ అన్నాడు.

చాలాసార్లు భారత్ పర్యటనకు వెళ్లా

చాలాసార్లు భారత్ పర్యటనకు వెళ్లా

'నేను చాలాసార్లు భారత్ పర్యటనకు వెళ్లా. ఉప ఖండంలో ఆడేటప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిని మేము ఎదుర్కొంటునే ఉన్నాం. తొలి రెండు రోజులు పరిస్థితి ఒక రకంగా ఉంటే, ఆ తదుపరి వికెట్ మరింత టర్న్ అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని మా ఆటగాళ్లు ఎలా నిలబడతారనేది వేచి చూడక తప్పదు' అని పాంటింగ్ తెలిపాడు.

2004 తర్వాత సిరిస్‌‌ను గెలవని ఆస్ట్రేలియా

2004 తర్వాత సిరిస్‌‌ను గెలవని ఆస్ట్రేలియా

2004 తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ సిరిస్‌ను కూడా గెలుచుకోలేదు. అప్పటి భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుకు రికీ పాంటింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సిరిస్‌లో భారత్ చేతిలో ఆసిస్ 2-1తో ఓటమి పాలైంది. పాంటింగ్ గాయం పాలవంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి మూడు టెస్టులకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్‌గా వ్వవహరించాడు.

నాలుగో టెస్టు మార్చి 25న ధర్మశాలలో

నాలుగో టెస్టు మార్చి 25న ధర్మశాలలో

నాలుగు టెస్టు మ్యాచ్ సిరిస్‌లో తొలి టెస్టు పూణెలో జరుగుతుండగా, చివరిదైనా నాలుగో టెస్టు మార్చి 25న ధర్మశాలలో జరగనుంది. ఇక ఆస్ట్రేలియా తరుపున రికీ పాంటింగ్ 168 టెస్టు మ్యాచ్‌లాడి 13,378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు ఉండటం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X