న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దెబ్బతిన్న పులి: కోహ్లీపై మిచెల్ స్టార్క్ హెచ్చరిక

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బతిన్న పులిగా అభివర్ణించాడు. బెంగళూరులో రెండో టెస్ట్ నాలుగు రోజుల్లో మొదలవుతుందనగా స్టార్క్ తన జట్టు సభ్యులకు పరోక్షంగా ఓ హెచ్

బెంగళూరు: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బతిన్న పులిగా అభివర్ణించాడు. బెంగళూరులో రెండో టెస్ట్ నాలుగు రోజుల్లో మొదలవుతుందనగా స్టార్క్ తన జట్టు సభ్యులకు పరోక్షంగా ఓ హెచ్చరిక జారీ చేశాడు.

శక్తివంతంగా తిరిగొస్తాడు..

శక్తివంతంగా తిరిగొస్తాడు..

‘విరాట్ క్లాసిక్ ఆటగాడు. ఈ ఏడాది ఇప్పటికే అతను కొన్ని వందల పరుగులు చేశాడు. అతను మరింత శక్తివంతంగా తిరిగొస్తాడు'అని స్టార్క్ చెప్పాడు. ‘ఒక టెస్ట్ గెలిచినంత మాత్రాన అయిపోలేదు. ఇంకా మూడు టెస్ట్‌లు ఉన్నాయి. సిరీస్‌ను పక్కా చేసుకోవాలంటే ఇంకా ఆరుస్లారు విరాట్‌ను ఔట్ చేయగలగాలి' అని అన్నాడు.

స్టార్క్ బౌలింగ్‌లోనే..

స్టార్క్ బౌలింగ్‌లోనే..

తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ.. స్టార్క్ బౌలింగ్‌లో ‘వైడ్ అవుట్‌సైడ్ ది ఆఫ్ స్టంప్‌' బంతిని ఆడి ఫస్ట్ స్లిప్‌లో హాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కోహ్లీ, స్టార్క్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులు కావడం గమనార్హం. కాగా, ఇరు జట్లు బెంగళూరు తర్వాత రాంచీ, ధర్మశాలలో మరో రెండు టెస్ట్‌లు ఆడనున్నాయి.

బెంగళూరు టెస్ట్‌కు షేన్ వార్న్ స్థానంలో బ్రెట్‌లీ..

బెంగళూరు టెస్ట్‌కు షేన్ వార్న్ స్థానంలో బ్రెట్‌లీ..

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు షేన్ వార్న్ కామెంటేటర్‌గా వ్యవహరించారు. అయితే ఆయన బెంగళూరులో జరగనున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌‌కు మాత్రం అందుబాటులో ఉండటంలేదు. దీంతో వార్న్ స్థానాన్ని బ్రెట్‌లీ భర్తీ చేయనున్నాడు. వార్న్ తనకున్న కాంట్రాక్ట్ నిమిత్తం లాస్ ఎంజిల్స్‌కు వెళ్లనున్నాడు. అయితే వార్న్ ట్విట్టర్‌లో బీసీసీఐకు, స్టార్ స్పోర్ట్స్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపాడు.

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వాళ్లే: డేవిడ్ వార్నర్

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వాళ్లే: డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాను ఎదుర్కొన్న కఠిమైన బౌలర్ల వివరాలను తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని జట్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ వార్నర్ సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు డెయిల్ స్టెయిన్, మోర్నె మార్కెల్ అని చెప్పాడు. వీరిరువురు సౌతాఫ్రికా బౌలర్లు కావడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X