న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్ కీపర్‌గా 1000 పరుగులు: ధోనికి సాధ్యం కాలేదు

By Nageshwara Rao

ఢాకా: భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సాధ్యం కాని ఓ రికార్డుని ఇంగ్లాండ్ ఆటగాడు సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.... ధోని నేతృత్వంలోని టీమిండియా అటు వన్డేల్లోనూ, ఇటు టెస్టుల్లోనూ ఎన్నో విజయాలను సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ క్రమంలో కెప్టెన్ ధోని కూడా తన పేరిట అనేక రికార్డులను నమోదు చేశాడు. అయితే టెస్టుల్లో ఓ ఏడాది గాను వెయ్యి పరుగులు పూర్తి చేయలేకపోయాడు. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఓ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు.

Bairstow becomes second wicketkeeper-batsman to score 1000 runs in a year

2000 ఏడాదిలో జింబాబ్వేకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆండీ ఫ్లవర్ టెస్టుల్లో వెయ్యి పరుగులు (1045) నమోదు చేసిన తొలి కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌లో బెయిర్ స్టో ఈ రికార్డుని సాధించాడు. తొలి టెస్టులో భాగంగా బెయిర్ స్టో ఓ క్యాలెండర్ ఏడాదిలో వెయ్య పరుగులు పూర్తి చేసుకున్నాడు.

2nd ODI @ కోట్లా: ఫలించిన ధోని వ్యూహం, రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో జో రూట్(40), మొయిన్ అలీ (63 నాటౌట్) ఆదుకున్నారు. 65 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బెయిర్ స్టో 35 పరుగులతో మొయిన్ అలీతో పాటు క్రీజులో ఉన్నాడు.

ఇక 2005లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధోని 2014 డిసెంబర్‌లో టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. తన కెరీర్‌లో 90 టెస్టులాడిన ధోని మొత్తం 4876 పరుగులు చేశాడు. అయితే ఓ ఏడాదిలో ఎప్పుడూ వెయ్యి అంతకంటే ఎక్కువ పరుగులు చేయక పోవడం గమనార్హం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X