న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగుళూరు టెస్టు, డే 3: పట్టు బిగించిన భారత్, ఆధిక్యం 126

బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకే ఆలౌటైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా సోమవారం మెరుగైన ఆటను ప్రదర్శించింది. రెండో ఇన్నింగ్స్‌లో ముూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది.

దీంతో కోహ్లీసేనకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా 79, రహానే 40 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ ఐదో వికెట్‌కు ఇప్పటివరకు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆసక్తికరంగా మారిన రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సోమవారం మూడో సెషన్‌లో టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శనను కనబర్చిన టీమిండియా ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్నారు. మూడో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి విఫలమయ్యాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హజెల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో స్పిన్ బౌలింగ్‌లో అవుటైన కోహ్లీ, ఈసారి మాత్రం పాస్ట్ బౌలర్‌ హజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.

పుజారా అర్ధ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పుజారా 50 పరుగులు పూర్తి చేశాడు. 128 బంతులను ఎదుర్కొన్న పుజారా 3 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 14వ అర్ధసెంచరీ. పుజారా, రహానేలు నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు సాధిస్తున్నారు. 60 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 60, రహానే 33 పరుగులతో ఉన్నారు.



50కి పైగా పరుగుల ఆధిక్యంలో భారత్‌
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 50 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. లంచ్‌ విరామానికి ముందు 49 పరుగుల వెనకంజలో ఉన్న టీమిండియా అనంతరం దూకుడుగా ఆడుతూ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు పుజారా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి మద్దతుగా రహానే ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలో 47 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 43, రహానే 15 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 61 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసిన కోహ్లీ

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్‌లో ఒక మార్పు చేసింది. కెప్టెన్ కోహ్లీ మూడో వికెట్‌గా వెనుదిరిగిన అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన రహానేను కాదని, ఆల్‌రౌండర్ జడేజాను పంపారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో తనకు లభించిన ప్రమోషన్‌ని జడేజా సద్వినియోగ పరచుకోలేకపోయాడు. 2 పరుగుల వద్ద జడేజా హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

టీ విరామానికి టీమిండియా 122/4
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్పిన్నర్ రవీంద్ర జడేజాను 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాజెల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన రహానేను కాదని, జడేజాను నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపినా ప్రయోజనం లేకపోయింది. టీ విరామ సమయానికి భారత్ 39 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పుజారా 34, రహానే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరోసారి 'ఎల్బీ'గా కోహ్లీ అవుట్
బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హజెల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో స్పిన్ బౌలింగ్‌లో అవుటైన కోహ్లీ, ఈసారి మాత్రం పాస్ట్ బౌలర్‌ హజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో కోహ్లీ రివ్యూ అడిగినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు పుజారా నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్ 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 33, జడేజా 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

రాహుల్ అవుట్: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
బెంగుళూరు వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ ఒకీఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వీరి 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పుజారా 22, కోహ్లీ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ
రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ 50పరుగులు పూర్తి చేశాడు. మూడో రోజైన సోమవారం ఆటలో భాగంగా కేఎల్ రాహుల్‌ 8 2బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో రాహుల్‌కి ఇది మొదటి అర్ధ సెంచరీ కావడం విశేషం. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం పరుగుల్లో కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే 90 పరుగులు చేశాడు. ముకుంద్ అవుటైన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారాతో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. రాహుల్ 51, పుజారా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆసీస్ కంటే 4 పరుగులు ముందంజలో ఉంది.

ముకుంద్‌ ఔట్‌: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
లంచ్ విరామం అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ 11వ ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్ ముకుంద్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (25), పుజారా(4) పరుగులతో ఉన్నారు.

లంచ్ విరామానికి భారత్ 38/0

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా లంచ్ విరామానికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల ఆధిక్యం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది.

ఓపెనర్లు లోకేష్ రాహుల్, అభినవ్ ముకుంద్‌లు నిలకడగా ఆడటంతో మూడో రోజు లంచ్ విరామ సమయానికి వికెట్ కోల్పోకుండా 38 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 49 పరుగుల వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ 20, ముకుంద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకే ఆలౌటైంది. 237/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 39 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 87 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

సోమవారం ఆసీస్ బ్యాట్స్‌మెన్ వేడ్, స్టార్క్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ సమయంలో ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడగొట్టాడు. భారీ షాట్ ఆడే క్రమంలో మిచెల్ స్టార్క్ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత వేడ్ 5, లియాన్ 0, హాజిల్ ఉడ్‌లు 2 పరుగులకే అవుటయ్యారు. ఈ మూడు వికెట్లను స్పిన్నర్ రవీంద్ర జడేజా తీసుకోవడం విశేషం. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్న జడేజా, తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మరింత భారీ ఆధిక్యం సాధించకుండా అడ్డుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా 6, అశ్విన్ 2, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

స్టార్క్ అవుట్, నాటౌట్
రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా 118వ ఓవర్‌ వేసేందుకు రవిచంద్రన్‌ అశ్విన్‌ బంతిని అందుకున్నాడు. అశ్విన్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్టార్క్ బ్యాట్‌ అంచును తాకుతూ బంతి వికెట్‌ కీపర్‌ చేతిలోకి వెళ్లింది. వెంటనే భారత ఆటగాళ్లు అవుట్‌గా అప్పీలు చేయడంతో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. అయితే స్టార్క్‌ రివ్యూ కోరగా నాటౌట్‌గా తేలింది.

అనంతరం అదే ఓవర్‌ చివరి బంతిని స్టార్క్‌ సిక్స్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌ వద్ద జడేజా బంతిని క్యాచ్‌పట్టాడు. దీంతో స్టార్క్‌ 26 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 274పరుగులు చేసింది.

ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన స్టార్క్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ 120 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. వేడ్ 40, ఓకీఫ్ 3 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X