బంగ్లా కెప్టెన్ రక్తపు వాంతి: కంగారు పడ్డ కుటుంబ సభ్యులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొర్తాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడి నోటి వెంట రక్తం కారడంతో బంధువులు హుటాహుడిన ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త బయటకు రాగానే బంగ్లా క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఇంటికి పంపించారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) వైద్యుడు దిబాషిష్ చౌధురి వెల్లడించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో భాగంగా ఊపిరితిత్తులు పరిశీలించామని, అంతా నార్మల్ గానే ఉందని అన్నారు.

Bangladesh skipper Mashrafe Mortaza rushed to hospital after he coughs up blood

'మొర్తజా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదయం కొద్దిపాటి రక్తం అతడి నోటి వెంట వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పంపించాం. ఊపిరితిత్తులు పరిశీలించాం. ఎలాంటి ప్రమాదం లేదు. అంతా బాగానే ఉంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా లేదు' అని తెలిపారు.

నోటి వెంట రక్తం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరగనుంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.

2009లో మొర్తాజా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ కోసం బంగ్లాదేశ్ ఇప్పటికే జట్టు ఎంపికపై దృష్టి సారించింది.

Champions Trophy 2017 : India vs Bangladesh Semi-final, India Under More Pressure | Oneindia Telugu

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mashrafe Mortaza, Bangladesh national cricket team’s charismatic captain, credited for leading his side to recent success in limited-overs cricket, was rushed to a hospital on Sunday after he coughed up blood.
Please Wait while comments are loading...