న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్‌ ఖర్చులు భరించగలరా..!: రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ లేఖ

By Nageshwara Rao

ముంబై: రాష్ట్ర సంఘాలకు నిధులు జారీ చేయొద్దని లోధా కమిటీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీసీసీఐ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 9 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లాండుతో టెస్ట్‌లకు టీమిండియా ఎంపిక, గంభీర్‌కు ఛాన్స్, పాండ్యాకు తొలిసారి

ఈ నేపథ్యంలో టెస్టు మ్యాచ్ నిర్వహణకు అయ్యే ఖర్చులను భరించగలరా? అంటూ ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టులకు ఆతిథ్యం ఇస్తున్న ఐదు రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ బుధవారం లేక రాసింది. అయితే ఈ వార్తలు నిజమేనా అన్న విషయంపై బోర్డుని సంప్రదించగా, బోర్డు వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

'మ్యాచ్‌ నిర్వహణకు అయ్యే ఖర్చులను భరించగలరా? అని లేఖ రాశాం. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇలా చేశాం. గతంలో మాదిరి 3-4 నెలలకు సరిపడా నిధులు కాకుండా.. దైనందిన కార్యకలాపాలకు తగినన్ని నిధులు తీసుకుంటున్నామ'ని బోర్డు వర్గాలు తెలిపాయి.

సచిన్ ఆనాడే చెప్పాడు: లీషాతో డేటింగ్, పాండ్యాపై ప్రత్యేకం

ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరిస్‌కు సౌరాష్ట్ర, ఆంధ్ర, పంజాబ్‌, ముంబై, చెన్నై క్రికెట్‌ సంఘాలు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఈ నెల 9న తొలి టెస్టు మ్యాచ్ రాజ్ కోట్‌లో జరనుండగా, సిరిస్‌లో భాగంగా ఆ తర్వాతి మ్యాచ్‌లు విశాఖపట్నం, మొహాలీ, ముంబై, చెన్నై జరగనున్నాయి

BCCI asks Test staging associations if they could host India-England matches

సుప్రీం కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వివిధ రాష్ట్ర సంఘాలకు బోర్డు తరలించిన నిధులను వినియోగించకుండా చూడాలంటూ లోధా కమిటీ బీసీసీఐ అనుబంధ సంఘాలను గత వారంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బోర్డు ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ జట్టు పర్యటనకు సంబంధించి ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్‌ బోర్డుతో ఎటువంటి కాంట్రాక్ట్‌లు కుదుర్చుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీసీసీఐలో సంస్కరణల అమలు కోసం నియమించడిన లోధా కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే ఎంవోయూ కుదుర్చుకుంటామని బోర్డు వర్గాలు తెలిపాయి.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్ నవంబర్
9-13 - తొలి టెస్ట్ - రాజ్‌కోట్ నవంబర్
17-21 - రెండో టెస్ట్ - విశాఖ నవంబర్
26-30 - మూడో టెస్ట్ - మొహాలి డిసెంబర్
8-12 - నాలుగో టెస్ట్ - ముంబై డిసెంబర్
16-20 - అయిదో టెస్ట్ - చెన్నై

మూడు వన్డేల సిరీస్
జనవరి 15 - తొలి వన్డే - పుణే
జనవరి 19 - రెండో వన్డే - కటక్
జనవరి 22 - మూడో వన్డే - కోల్‌కతా

మూడు ట్వంటీ 20ల సిరీస్
జనవరి 26 - తొలి ట్వంటీ 20 - కాన్పూర్
జనవరి 29 - రెండో ట్వంటీ 20 - నాగపూర్
ఫిబ్రవరి 1 - మూడో ట్వంటీ 20 - బెంగళూరు

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X